huccha venkat
-
నటుడిని చితక్కొట్టిన యువకుడు
-
నటుడిని చితక్కొట్టిన యువకుడు
సాక్షి, బెంగళూరు : బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, కన్నడ నటుడు హుచ్చ వెంకట్ తన వింత చేష్టలతో మరోసారి దెబ్బలు తిన్నాడు. రెండు రోజుల క్రితం కొడగులో తన వైపు ఎందుకు వింతగా చూస్తున్నారంటూ ఇతరుల కారు అద్దాలను వెంకట్ ధ్వంసం చేశాడు. దీంతో స్థానిక యువకులు అతడిని చితక్కొట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మండ్య నగరానికి వచ్చి ఒక హోటల్లో దిగిన హుచ్చ వెంకట్ ఆదివారం ఉదయం మరోసారి పిచ్చిగా ప్రవర్తించాడు. హోటల్ ముందు నిలిపి ఉన్న గుర్తు తెలియని కారు అద్దాలను పగులగొట్టాడు. దాంతో అక్కడ ఉన్న కారు యజమాని అయిన యువకుడు హుచ్చ వెంకట్ మీద దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వెంకట్‌ను తీసుకొని వెళ్లారు. కొడగులో హుచ్చను చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా నటుడిగా గుర్తింపు పొందిన హుచ్చ వెంకట్ గతంలో కూడా అనేకసార్లు ఇలాగే ప్రవర్తించాడు. తాగిన మైకంలో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి.. అక్కడ ఉన్నవాళ్లను కాళ్లతో తన్ని అలజడి సృష్టించాడు. బేకరి యజమానిపై కూడా దాడికి దిగాడు. బేకరి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుచ్చ వెంకట్‌ను హెచ్చరించి పంపివేశారు. అనంతరం వెంకట్ కనిపించకుండా పోయాడు. అదే విధంగా విధానసభ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ వార్తల్లో నిలిచాడు. అంతేగాకుండా దివ్య స్పందన అనే నటిని పెళ్లి పేరుతో వేధించినందుకు అతనిపై కేసు నమోదైంది. ఓ టెలివిజన్ డిబేట్లో గతంలో ఒక డైరెక్టర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. -
తాగిన మైకంలో నటుడు వీరంగం
యశవంతపుర : తాగిన మైకంలో హుచ్చ వెంకట్ వీరంగం సృష్టించిన ఘటన రాజ రాజేశ్వరినగరలో చోటు చేసుకొంది. గురువారం ఉదయం నిద్రలేచి సమీపంలోని ఓ బేకరివద్దకు హుచ్చవెంకట్ వెళ్లాడు. ఏమి మాట్లాడకుండానే దుకాణం వద్ద ఉన్నవారిపై కాళ్లతో తన్ని అలజడి సృష్టించాడు. బేకరి యజమానిపై కూడా దాడికి దిగాడు. బేకరి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుచ్చ వెంకట్‌ను హెచ్చరించి పంపివేశారు. అనంతరం వెంకట్ కనిపించకుండా పోయాడు. -
ఏమో.. ప్రధానినీ కావచ్చేమో : నటుడు
శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సినీ నటుడు హుచ్చ వెంకట్ తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వినూత్న నటన ప్రదర్శిస్తూ ఆయన సినీ అభిమానులకు సుపరిచితమే. శనివారం ప్రెస్‌క్లబ్‌లో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్నం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుచేత ఈసారి కాంగ్రెస్‌పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వదన్నారు. అలాగే జేడీఎస్ సైతం మునిరత్నంకు టికెట్ ఇవ్వటానికి నిరాకరిస్తోందని, ఒకవేళ టికెట్ ఇస్తే ముందు ఏర్పడే బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కళంకం ఏర్పడుతుందని ఇవ్వదని జోస్యం చెప్పారు. ఇప్పటికే కుక్కర్ల రాజకీయం ఆరంభమైందని, అంతేకాకుండా చీరలు, మద్యం అమ్మకాలు అధికమయ్యాయని తెలిపారు. ఇకపై స్థలాలు అమ్ముతారు, విధానసౌధను సైతం అమ్మటానికి వెనుకాడని నాయకులకు ఎన్నికల్లో అవకాశం కల్పించరాదని పిలుపునిచ్చారు. మునిరత్నం ఎమ్మెల్యేగా కాకముందు ఉన్న బ్యాంకు బ్యాలెన్స్, ప్రస్తుతమున్న బ్యాంకు బ్యాలెన్స్‌పై లోకాయుక్త తనిఖీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. వినూత్న రీతిలో ప్రచారం చేపడతా త్వరలోనే ఎమ్మెల్యే నామినేషన్ వేసిన తరువాత వినూత్నంగా ప్రచారం చేపడతానన్నారు. నరేంద్ర మోదీ, బరాక్ ఒబామా సైతం చేపట్టని ప్రచారాన్ని చేపట్టాలని ప్లాన్ చేసుకున్నానని మీడియాకు చెప్పారు. తనది కుక్కర్ల పార్టీ కాదని, ఎన్నికల్లో గెలిపిస్తే తనకు వచ్చే జీతం తీసుకొంటూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తానన్నారు. -
ఆత్మహత్యకు యత్నించి తప్పుచేశా: సినీ నటుడు
శివాజీనగర(కర్నాటక): ప్రియురాలి కోసం ఆత్మహత్యకు యత్నించి, తన తల్లిదండ్రులకే ద్రోహం తలపెట్టే లా వ్యవహరించి చాలా తప్పు చేశానని, ఇందుకు సమాజాన్ని క్షమాపణ కోరుతున్నానని కన్నడ సినీ నటుడు హుచ్చ వెంకట్ పేర్కొన్నారు. తనను ప్రేమించిన సినీ నటి రచనా వివాహానికి తిరస్కరించటంతో ఆత్మహత్యకు యత్నించినట్లు వెంకట్ మంగళవారం మీడియా ముందు స్పష్టం చేశారు. నటి రచనతో ఏర్పడిన ప్రేమ వ్యవహారాన్ని వెంకట్ వివరించారు. రచన ప్రోద్భలంతోనే ఆమె ప్రేమలో పడ్డానని చెప్పారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంలో తనతో పరిచయం పెంచుకోవడంతో పాటు సెల్ఫీ తీసుకొనటం ద్వారా రచన స్నేహం చేసిందని పేర్కొన్నారు. అలా ప్రేమ చిగురించిందని, అయితే తాను రాజకీయ ప్రవేశం చేసి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన తరువాత రెండు సంవత్సరాలకు వివాహం చేసుకొంటానని తేల్చిచెప్పినట్లు వెంకట్ వివరించారు. ఆ తరువాత తాను వివాహం చేసుకోవాలని అడగటంతో తమ ఇంట్లోవారు ఒప్పుకోవటం లేదని రచన అన్నారన్నారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన తాను ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు వెంకట్ తెలిపారు.