రేపు ఈ దారుల్లో వెళ్లొద్దు
- శుక్రవారం పలు ప్రాంతాల్లో అమలు
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలో భారీ ఊరేగింపు జరుగనున్న నేపథ్యంలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కమిషనర్ మహేందర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాలతో పాటు అది చేరుకున్న ప్రదేశాల్లో అవసరాన్ని బట్టి వీటిని అమలు చేయనున్నారు. నగర వాసులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా య మార్గాలు ఎంచుకోవాలని ఆయన సూచించారు.
♦ అఫ్జల్‌గంజ్, ఎస్జే బ్రిడ్జ్, శంకర్‌షేర్ హోటల్ వైపు నుంచి పుత్లిబౌలి చౌరస్తా వైపు వెళ్లే వాహనాలను గౌలిగూడ చమాన్ నుంచి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, సీబీఎస్ వైపు మళ్లిస్తారు.
♦ కోఠి ఆంధ్రాబ్యాంక్, రంగ్‌మహల్ వైపు నుంచి గౌలిగూడ చమాన్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని రంగ్‌మహల్ వైపు మళ్లిస్తారు.
♦ చాదర్‌ఘాట్ చౌరస్తా నుంచి పుత్లిబౌలి చౌరస్తా వైపు వెళ్లే వాహనాలను రంగ్‌మహల్ ‘వై’ జంక్షన్ నుంచి సీబీఎస్ వైపు పంపిస్తారు.
♦ పుత్లిబౌలి చౌరస్తా నుంచి ఆంధ్రాబ్యాంక్ వైపు, జీపీఓ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
♦ ఊరేగింపు కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ వద్దకు చేరుకున్నప్పుడు చాదర్‌ఘాట్ చౌరస్తా వైపు నుంచి ఆంధ్రాబ్యాంక్ వైపు వెళ్లే వాహనాలను డీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్ నుంచి సుల్తాన్బజార్చౌరస్తా వైపు పంపిస్తారు.
♦ ఊరేగింపు కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలను బడీచౌడి వైపు మళ్లిస్తారు.
♦ ఆజామాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను క్రౌన్ కేఫ్ నుంచి వీఎస్టీ చౌరస్తా మీదుగా పంపిస్తారు.
♦ ముషీరాబాద్ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను మెట్రో కేఫ్ నుంచి రామ్‌నగర్ ‘టి’ జంక్షన్ వైపు పంపిస్తారు.
♦ హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ నుంచి నారాయణగూడ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా మాత్రమే పంపిస్తారు. దిగువ నుంచి వాహనాలను అనుమతించరు.
♦ క్రౌన్ కేఫ్ వైపు నుంచి నారాయణగూడ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను నేరుగా ఫ్లైఓవర్ మీదికి పంపిస్తారు.
♦ నారాయణగూడ చౌరస్తా, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మధ్య వాహనాలకు ప్రవేశం లేదు.
♦ కింగ్‌కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి వ చ్చే వాహనాలను వైఎంసీఏ సర్కిల్ వైపు అనుమతిం చరు. వీటిని ఈడెన్ గార్డెన్ నుంచి సిమెట్రీ వైపు పంపిస్తారు.
♦ బర్కత్‌పుర చమాన్ వైపు నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని ఓల్డ్ పోస్టాఫీస్ చౌరస్తా నుంచి క్రౌన్ కేఫ్, కాచిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు.
♦ కవాడీగూడ చౌరస్తా-ప్రాగా టూల్స్ మధ్య ప్రధా న రహదారిపై ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు.
♦ కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను కవాడీగూడ చౌరస్తా వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్ క్లబ్ ‘టి’ జంక్షన్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ మీదుగా పంపిస్తారు.
♦ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయం వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను డీబీఆర్ మిల్స్ వైపు పంపిస్తారు.
♦ ప్రధాన ఊరేగింపు ఆర్పీ రోడ్‌కు చేరుకున్నప్పుడు కర్బాలామైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంజీరోడ్ వైపు పంపిస్తారు.
♦ ట్యాంక్‌బండ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సుల్ని కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్, మినిస్టర్స్ రోడ్ వైపు పంపిస్తారు.
♦ టివోలీ జంక్షన్ నుంచి బాలమ్రాయ్ వైపు వచ్చే వాహనాలను ఎన్సీసీ చౌరస్తా, నార్నే ఎస్టేట్స్ వైపు పంపిస్తారు.
♦ సీటీఓ ఎక్స్ రోడ్ నుంచి బాలమ్రాయ్ వైపు వచ్చే వాహనాలను లీ రాయల్ ప్యాలెస్ నుంచి బ్రూక్‌బాండ్ చౌరస్తా, ఇంపీరియల్ గార్డెన్స్, మస్తాన్ కేఫ్ వైపు పంపిస్తారు.
♦ ఎన్సీసీ చౌరస్తా నుంచి డైమండ్ పాయింట్ వైపు వెళ్లే వాహనాలను నార్నే ఎస్టేట్స్ నుంచి కార్ఖానా బస్తీ వైపు పంపిస్తారు.
♦ బాపూజీనగర్ నుంచి తాడ్‌బండ్ వైపు వచ్చే వాహనాలను సెంటర్ పాయింట్ నుంచి డైమండ్ పాయింట్, కార్ఖానా వైపు పంపిస్తారు.
♦ మేడ్చెల్, బాలానగర్ వైపుల నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలను సేఫ్ ఎక్స్‌ప్రెస్ నుంచి బాపూజీనగర్, బోయిన్పల్లి మార్కెట్ మీదుగా పంపిస్తారు.