మెట్రోలతో పోటీ
విశ్వనగరం దిశగా వడివడి అడుగులేస్తున్న భాగ్యనగరి...అభివృద్ధి విషయంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో పోటీ పడుతోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ ఇండియా సంస్థ 2015లో నిర్వహించిన సర్వేలో నాలుగో స్థానం సంపాదించి సత్తా చాటింది. ఈ సంస్థ ఆయా నగరాల్లో 800 అంశాలను పరిశీలించి సిటీలకు ర్యాంకులిచ్చింది. సర్వేలో పరిగణనలోకి తీసుకున్న అంశాల్లో.. భౌతిక వనరులు, ఆర్థిక పరిస్థితి, మౌలిక వసతులు, పరిపాలన, మానవ సామర్థ్యం, జనాభా, సంపద పంపిణీ, వ్యాపార ప్రోత్సాహకాలు, వ్యవస్థాగత సహకారం తదితరాలు ఉన్నాయి. ఈ సర్వేలో 69.73 స్కోర్ సాధించి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. చివరి రెండు స్థానాల్లో నిలిచిన పుణె 59.85, అహ్మదాబాద్ 58.04 పాయింట్లు సాధించడం విశేషం. సర్వేలో మెట్రోపాలిటన్ సిటీలు సాధించిన స్కోర్, ర్యాంకుల వివరాలిలా ఉన్నాయి.