ల్యాబ్లో మానవ పిండాల సృష్టి
వాషింగ్టన్: మానవ అభివృద్ధి క్రమంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. తొలిసారిగా మానవ పిండాలను రెండు వారాల పాటు ల్యాబ్లో అభివృద్ధి చేశారు. తొందరగా గర్భస్రావం కావడానికి కారణాలు తెలుసుకోవడానికి, మానవ వికాసానికి సంబంధించి తలెత్తే అనేక ప్రశ్నలకు ఇది సమాధానం కాగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మానవ అభివృద్ధిలో ఫలదీకరణం తర్వాత 14వ రోజు వరకు జరిగే అణు, కణ ప్రక్రియలను ఈ పరిశోధనలో క్షుణ్నంగా పరిశీలించారు. గర్భాశయం బయట మొదటిసారిగా విజయవంతంగా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.