humanity angle
-
వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయండి
ఓస్లో: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆస్తుల్ని విడుదల చేయాలని, రాజకీయపరమైన విభేదాలతో సాధారణ పౌరుల్ని శిక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకలి కేకలు, గడ్డ కట్టించే చలి పరిస్థితుల్లో స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమ దేశాల ప్రతినిధులు అఫ్గాన్ మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో మాట్లాడి అఫ్గాన్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
Zomato: డెలివరీ బాయ్ జీవితం మార్చేసిన ‘ఆరోజు రాత్రి’
సాక్షి, హైదరాబాద్: పేదరికంతో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ యువకుడు అతికష్టమ్మీద చేతనైన పని చేస్తున్నాడు. జొమాటోలో డెలివరీ బాయ్‌గా చేరాడు. అయితే అతడు డెలివరీ చేసేది సైకిల్‌పై. నిజమే జొమాటో యాప్‌లో వచ్చిన ఆర్డర్లు తన సైకిల్‌పై డెలివరీ చేస్తుంటాడు. పేదరికంతో బైక్ లేక సైకిల్‌పై ఆర్డర్లు ఇస్తున్న విషయాన్ని ఓ కస్టమర్ చూశాడు. ఆ యువకుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే అతడి వివరాలు కనుక్కుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హైదరాబాద్ ప్రజలు చేదోడుగా నిలిచారు. అందరి సహాయంతో ఇప్పుడు ఆ యువకుడికి బైక్ లభించింది. ఈ స్టోరీ మన హైదరాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని కింగ్‌కోఠికి చెందిన రాబిన్ ముకేశ్ జొమాటోలో ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్‌ను పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆకీల్ (21) లక్డీకాపూల్ నుంచి పార్సిల్ తీసుకుని 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్‌కోఠిలో ఇచ్చేందుకు వెళ్లాడు. పార్సిల్ తీసుకోవడానికి కిందకు వచ్చిన రాబిన్ ముకేశ్ ఆకీల్‌ను చూసి షాకయ్యాడు. అతడు డెలివరీ చేసేది ఒక సైకిల్‌పై అని తెలుసుకుని చలించిపోయాడు. పైగా వర్షంలో తడుచుకుంటూ సైకిల్‌పై రావడంతో అతడి పరిస్థితి తెలుసుకున్నాడు. ఆకీల్‌ది పేద కుటుంబం. తల్లిదండ్రులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. తండ్రి సంపాదన అంతత మాత్రమే ఉండడంతో ఆకీల్ డెలివరీ బాయ్‌గా చేరాడు. బైక్ కొనే స్థోమత లేక సైకిల్‌పైనే ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. జొమాటో వారికి తన పరిస్థితి చెప్పి సైకిల్‌పై డెలివరీ చేస్తున్నాడు. డెలివరీ చేస్తూనే ఆకీల్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇదంతా విన్న రాబిన్ వెంటనే ఈ విషయాలన్నీ 32 వేల మంది ఉన్న ‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్’ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. అతడికి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కొనేందుకు రూ.65,800 కావాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా వెంటనే స్పందించి తోచినంత సహాయం చేశారు. దీంతో రెండు రోజుల్లోనే రూ.73 వేలు పోగయ్యాయి. ఆ డబ్బులతో రాబిన్ టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కొని ఆకిల్‌కు అందించాడు. బైక్‌తో పాటు హెల్మెట్, రెయిన్ కోట్, శానిటైజర్, మాస్క్‌లు, మిగిలిన డబ్బులను ఆకీల్ బీటెక్ చదువు ఫీజుల కోసం అందించారు. బైక్ రావడంతో ఇప్పుడు మరిన్ని ఆర్డర్లు చేసి అధిక ఆదాయం పొందుతానని ఆకీల్ చెబుతున్నాడు. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫేసుబుక్ గ్రూప్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు. ఆకీల్ కుటుంబానికి తాము సహాయం చేస్తామని మరికొందరు ముందుకు వస్తున్నారు. ఆకీల్ పరిస్థితిపై జూన్ 17న ‘సాక్షి’లో ‘ముందుకు సాగిపో.. నీ గమ్యం చేరిపో’ అనే కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. మహ్మద్ ఆకీల్‌కు ద్విచక్ర వాహనం అందిస్తున్న ‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్’ ఫేసుబుక్ గ్రూప్ ప్రతినిధులు -
అందరూ ఉన్నా.. అనాథ
ఆత్మకూరు: ఆయన.. అందరూ ఉన్న అనాథ. బాగా బతికిన రోజుల్లో దగ్గరగా ఉన్న తోబుట్టువులు.. చితికిపోయిన సమయంలో దూరమయ్యారు. ఊర్లోనే రక్త సంబంధీకులు ఉన్నా.. ఆ వృద్ధుడి పరిస్థితి చూస్తే మమకారాలు, మానవత్వం మంట కలిశాయని చెప్పక తప్పదు. వారం రోజులుగా మున్సిపల్ బస్టాండ్‌లో ఓ వృద్ధుడు ఆకలి దప్పులతో అలమటిస్తూ పడి ఉన్నాడు. వివరాల్లోకెళితే.. పట్టణంలోని జేఆర్‌పేటకు చెందిన పసుపులేటి మోహన్ ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తే. ఇళ్లలో ప్రైవేట్‌గా కరెంట్ పనులు చేసుకుంటూ బతికిన వ్యక్తి. ఈ క్రమంలో భార్య అనారోగ్యానికి గురైంది. ఆమె వైద్యం కోసం ఖర్చు చేసి ఉన్న ఇల్లును అమ్మేసుకున్నాడు. గతేడాది అనారోగ్యానికి గురైన భార్య మృతి చెందడంతో ఇతను అనారోగ్యం పాలయ్యాడు. సొంత అన్నదమ్ములు ఉన్నా పట్టించుకునేవారు లేరు. భార్య చనిపోవడంతో, ఇల్లు అమ్ముకోవడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఇతనిని ఎవరూ ఆదరించలేదు. సరైన తిండి లేక శల్యమయ్యాడు. వారం రోజులుగా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ భవనమే షెల్టర్‌గా ఉంటున్నాడు. ఎవరైనా దాతలు చూసి తిండి పెడితే తింటున్నాడు. ఐదు రోజులుగా పట్టణంలో లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. దీంతో ఇతనిని గమనించి ఆహారం అందించే వాళ్లు లేరు. బుధవారం పట్టణానికి చెందిన వలంటీర్ హరీష్ బుధవారం ఆ దారిన వెళుతూ అతని పరిస్థితి చూసి ఆహారం అందించాడు. అది సైతం తినే శక్తి లేక నానా ఇబ్బందులు పడుతూ కొంత ఆహారం తిన్నట్లు హరీష్ తెలిపాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్‌బాబులు ఆ వృద్ధుడికి మున్సిపల్ బస్టాండ్ ఆవరణలోనే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. పట్టించుకునే వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మానవత్వం పరిమళించే...
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారికి కాలు విరిగితే నగరానికి చెందిన యువకుడు వైద్యం చేయించి మానవత్వం చాటుకున్నాడు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వత్తిబాట గ్రామానికి చెందిన సింగమాల రమణయ్య, శశికళ దంపతులు కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారి కుమార్తె గాయత్రి(3) ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడడంతో కాలు విరిగింది. వైద్యానికి రూ.2లక్షలు ఖర్చు అవుతుందని స్థానిక వైద్యులు చెప్పడంతో గాయత్రి తల్లిదండ్రులు జిల్లాకు చెందిన శ్రీజ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాస్‌ను సంప్రదించారు. తన ట్రస్ట్ ఫేస్బుక్, వాట్సాప్ పేజీలలో శ్రీనివాస్ ఈ సమాచారాన్ని ఉంచాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని సంస్థ కోఆర్డినేటర్ రాఘవేంద్ర తెలుసుకుని చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తన మిత్రులు, పరిచయస్థుల నుంచి రూ. 75వేలు సేకరించి గాయత్రి తల్లిదండ్రులకు అందించాడు.