మానవత్వం పరిమళించే... | humanity still alive | Sakshi
Sakshi News home page

మానవత్వం పరిమళించే...

Published Mon, Jun 1 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

humanity still alive

జూబ్లీహిల్స్ (హైదరాబాద్): ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారికి కాలు విరిగితే నగరానికి చెందిన యువకుడు వైద్యం చేయించి మానవత్వం చాటుకున్నాడు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వత్తిబాట గ్రామానికి చెందిన సింగమాల రమణయ్య, శశికళ దంపతులు కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారి కుమార్తె గాయత్రి(3) ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడడంతో కాలు విరిగింది.

వైద్యానికి రూ.2లక్షలు ఖర్చు అవుతుందని స్థానిక వైద్యులు చెప్పడంతో గాయత్రి తల్లిదండ్రులు జిల్లాకు చెందిన శ్రీజ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాస్‌ను సంప్రదించారు. తన ట్రస్ట్ ఫేస్‌బుక్, వాట్సాప్ పేజీలలో శ్రీనివాస్ ఈ సమాచారాన్ని ఉంచాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని సంస్థ కోఆర్డినేటర్ రాఘవేంద్ర తెలుసుకుని చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తన మిత్రులు, పరిచయస్థుల నుంచి రూ. 75వేలు సేకరించి గాయత్రి తల్లిదండ్రులకు అందించాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement