Hunar Haat
-
ఘన సంస్కృతిని ముందుతరాలకు అందిద్దాం
కవాడిగూడ: ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం చిరునామాగా ఉందని, ఈ సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిద్దామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహిస్తున్న హునార్ హాత్ ప్రదర్శనను ఆదివారం కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, మన ప్రాచీన వారసత్వాన్ని హునార్ హాత్‌లో చూసుకోవచ్చని తెలిపారు. కరోనాతో చిన్న కళాకారులు బాగా నష్టపోయారని, వారికి ఆర్థిక సహాయం అందజేసేందుకు హునార్ హాత్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని 75 ప్రధాన నగరాల్లో హునార్ హాత్‌ను ఏర్పాటు చేశారని, ఈ ప్రదర్శనను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రజలు దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ఆదుకోవాలని సూచించారు. ఆయారంగాల్లో గుర్తింపుపొందిన దేశవ్యాప్త కళాకారుల చేత ప్రదర్శనలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఏప్రిల్ 1, 2, 3 తేదీలలో ఎన్టీఆర్ స్టేడియంలో అఖిలభారత సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి నఖ్వీ మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్యంలో చేతి వృత్తులు, కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు మిషన్ మోడ్‌పై కృషిచేయడం ప్రారంభించిందన్నారు. తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్తకళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్థానిక కార్పొరేటర్ రచనశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్ 26 నుంచి హైదరాబాద్‌లో హున్నార్ హాట్
సాక్షి, న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లో హున్నార్ హాట్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. నవంబరు 26 నుంచి డిసెంబరు 5 వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న హున్నార్ హాట్లో ఆంధ్రప్రదేశ్ సహా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 700 మంది కళాకారులు, చేతివృత్తుల నిపుణులు పాల్గొంటారని వెల్లడించారు. -
‘హునర్ హాట్’ మేళాను సందర్శించిన మోదీ
-
హైదరాబాద్‌లో ‘హునర్ హాత్’ ఏర్పాటు
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నఖ్వీ న్యూఢిల్లీ: తెలంగాణలో మైనారిటీ వర్గాలకు చెందిన నిపుణులైన కళాకారులు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించ డానికి, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ను వారికి అందు బాటులోకి తేవడానికి అనువుగా హైదరాబాద్‌లో త్వరలోనే ‘హునర్ హాత్’ను నిర్వహిస్తామని కేంద్ర మైనారిటీ వ్యవహా రాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. మొదటి హునర్ హాత్‌ను గత నవంబర్‌లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరుగుతున్న రెండో హునర్ హాత్కు చెందిన ఫేస్బుక్ పేజీని నఖ్వీ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, గుజరాత్, కశ్మీర్, అస్సాం, ఒడిశా రాష్ట్రాల నుంచి మైనారిటీ వర్గాలకు చెందిన 100కి పైగా చేతివృత్తుల వారు, శిల్పులు, వంటల నిపుణులు హునర్హాత్లో ఏర్పాటు చేసిన 130 స్టాళ్లలో పాల్గొంటున్నారు. తెలంగాణకు చెందిన బంజారా ఎంబ్రాయిడరీ హునర్ హాత్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో హునర్ హాత్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, లక్నో, కోల్‌కతా, పట్నాలలో త్వరలోనే హునర్ హాత్లను నిర్వహించాలని నిర్ణయించామని నఖ్వీ చెప్పారు.