ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృతి
రోమ్ :
ఉత్తర ఇటలీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హంగేరికి చెందిని విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 36 మందికి గాయాలయ్యాయని ఇటలీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అతి వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి పైలాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 52 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా హంగేరియాకు చెందిన 16 నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థులుగా సమాచారం. స్కూల్ ట్రిప్ ముగించుకొని ఫ్రాన్స్ వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.