ప్రాణం తీసిన అనుమానం
సాక్షి, కాకినాడ: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్యచేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వలస అలివేలు(28) అనే వివాహితను ఆమె భర్త వెంకటరమణ గత కొద్ది రోజులుగా అనుమానిస్తున్నాడు. ఇదే విషయమై శనివారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం తలపై రాయితో కొట్టి అలివేలును చంపేశాడు. కాగా... ఆదివారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రాగా సమాచారమందుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.