భర్తతో మనస్పర్థలా?
చిత్ర పరిశ్రమలో విడాకుల సంస్కృతి నానాటికీ అధికం అవుతోందని చెప్పక తప్పదు. వాస్తవం ఎంతో గానీ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. అశ్విన్,సౌందర్యల మధ్య మనస్పర్ధలే ఇందుకు కారణం అని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్,లతా రజనీకాంత్‌ల రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్. గ్రాఫిక్స్ టెక్నాలజిలో నిపుణురాలైన ఆమె గోవా చిత్రం ద్వారా నిర్మాతగానూ, తన తండ్రి హీరోగా నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్ చిత్రంతో దర్శకురాలు గానూ పరిచయం అయ్యారు. తాజాగా తన సోదరి ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్ హీరోగా ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సౌందర్య రజనీకాంత్‌కు 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వారికి ఇటీవలే ఇక బిడ్డ కూడా కలిగాడు. నాలుగు నెలలుగా అశ్విన్, సౌందర్యరజనీకాంత్‌లు దూరంగా ఉంటున్నారనీ కోడంబాక్కం వర్గాలు వదంతులకు తెరలేపారు. ప్రస్తుతం సౌందర్య రాజనీకాంత్ స్థానిక చేట్‌పేట్‌లోని ఇంటిలో ఒంటరిగా నివశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు వీరి దాంపత్యజీవితం విడాకులకు దారి తీసినట్లు, అయితే వారి సన్నిహితులు,స్నేహితులు అంత దాకా వెళ్లకుండా సర్దిచెప్పి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.