భర్తను చంపినట్టే చంపి.. ప్రతీకారం తీర్చుకుంది
కోయంబత్తూరు: ఓ మహిళ తన భర్తను చంపిన హంతకుడిని అందరూ చూస్తుండగానే, బస్టాండ్‌లో చంపి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
రంగస్వామి, సుగంధమణి దంపతుల ఇంట్లో రవికుమార్ (50) అనే అతను పనిచేస్తుండేవాడు. ఏడాదిన్నర క్రితం రవికుమార్ గొడవపడి రంగస్వామిని బండరాయితో మోది చంపాడు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రవికుమార్ గురువారం రాత్రి సుగంధమణి ఇంటికి వెళ్లి కేసు విషయంపై బెదిరించాడు. శుక్రవారం ఉదయం కోయంబత్తూరులోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న రవికుమార్‌ను సుగంధమణి పెద్ద రాయితో పలుమార్లు బాదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఆమె బస్సులో వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.