విశాఖ - హైదరాబాద్ దురంతో ఎక్స్ప్రెస్లో చోరీ
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున నగదు, బంగారాన్ని దోచుకున్నారు. దీంతో బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.