Hyundai Motor India Ltd
-
హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్‌ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్‌లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్ మార్కెట్ మోడల్‌తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్ 5, కోనా ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్ ఈవీ, ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఈవీ, మైల్డ్ హైబ్రిడ్ ఈవీ, ఫ్యూయల్ సెల్ ఈవీలను తయారు చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్‌యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. -
బడా ఐపీఓల బొనాంజా!
ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 77,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్ దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లిస్టింగ్‌వైపు చూపు... రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్ఎస్డీఎల్ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్ల, ఎమ్క్యూర్ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.ఎల్ఐసీ రికార్డుకు చెక్!దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. -
అందుబాటు ధరల్లో లగ్జరీ కార్లే లక్ష్యం
హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆటోమొబైల్ పరిశ్రమలో వేగంగా మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లతో వినియోగదారులను అకట్టుకున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ భారత్‌లో అడుగుపెట్టి 15 ఏళ్లయింది. గత ఆరునెలల్లో గ్రాండ్ఐ10, శాంతాఫే, ఎక్సెంట్, మై 14 వెర్నా లాంటి విజయవంతమైన మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇంత వరకూ దేశంలో 50 లక్షల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. దేశంలో అడుగిడిన ఐదేళ్లలోనే (2004లో) అతిపెద్ద వాహన ఎగుమతిదారుగా ఎదిగింది. వాహన శ్రేణిలోని వ్యత్యాసాలను తొలగిస్తూ అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ఎంట్రీ లెవల్ నుండి కాంపాక్ట్, హైకాంపాక్ట్, ఎంట్రీ లెవెల్ సెడాన్ , మిడ్‌సైజ్, ప్రీమియం, ఎస్యూవీ...ఇలా అన్ని మోడళ్లను కొలువు దీర్చింది. 15 ఏళ్లు పూర్తి చేసుకొని 16 ఏట అడుగుపెడుతున్న కంపెనీ భారత్‌లో ఎదుర్కొన్న సవాళ్ల నుండి నేర్చుకొన్న పాఠాలతో పాటు భవిష్యత్తుపై అంచనాలను హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ సాక్షితో పంచుకొన్నారు. ఆవివరాలివీ... ఇండియాలో ప్రవేశించి 15 ఏళ్లు గడిచాయి. ఈ మార్కెట్లో ఎదురైన సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు? సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆటోమొబైల్ తయారీదార్లకు భారత్ ఎంతో ఆకర్షణీయమైన మార్కెట్. కొరియా, జపాన్,జర్మనీ, అమెరికా దేశాలు ఈ మార్కెట్లో పోటీపడటం దీనికి నిదర్శనం. కారు ధర కన్నా కూడా నాణ్యత, నవ్యత, ప్రపంచ స్థాయి ఉత్పత్తులకు ఇక్కడి వినియోగదారుడు ఎప్పుడే జైకొడతాడు. అందుకే మేం ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇంతవరకూ అన్ని కేటగిరీ వాహనాల్లో వార్షిక వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నాం. వినియోగదారుడు మెచ్చుకొనే తయారీదారు కావాలన్నదే మా లక్ష్యం. లగ్జరీ కార్లు, బడ్జెట్ కార్లు... ఈ రెండింటి మార్కెట్ ఎలా ఉండబోతోంది? హై వాల్యూ ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడమే మా విధానం. భారత్‌లో కస్టమర్ ఆకాంక్షలకు అనుగుణంగా మా కార్ల ధరలను నిర్ణయిస్తున్నాం. మా ఉత్పత్తులో ఇయాన్ నుండి శాంతా ఫే వరకూ అన్ని కార్లూ ఆయా సెగ్మెంట్లలో స్థిరపడ్డాయి. అందుబాటు ధరల్లో లగ్జరీ ఉత్పత్తులను పొజిషన్ చేయడమే మా మార్కెటింగ్ వ్యూహం. స్థిరమైన కేంద్ర ప్రభుత్వం...ఆటో పరిశ్రమ బడ్జెట్ నుండి ఏం కోరుకొంటోంది? ఎక్సైజ్ సుంకం తగ్గింపును ఈ ఆర్థిక సంవత్సరం చివరి దాకా పొడిగించాలి. దీంతో పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతమున్న ఎక్సైజ్ డ్యూటీ విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో కారును సొంతం చేసుకోవాలన్న మధ్య తరగతి కలలు నెరవేరుతాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఆటో పరిశ్రమ మరింత ఉత్సాహంగా వృద్ధి చెందుతుంది. వడ్డీ రేట్లను సరళీకరిస్తే బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేందుకు మరింత మంది ముందుకు వస్తారు. వినియోగదార్ల సెంటిమెంట్‌లో సానుకూల మార్పు వస్తుందని మేం ఆశిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పరిశ్రమ ఎదుర్కొనే సవాళ్లు? పెరుగుతున్న ద్రవ్యోల్భణం, చమురు ధరలు, వడ్డీ రేట్లు...పరిశ్రమను కుంగ దీశాయి. వీటిని ధీటుగా అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన ఆర్థిక విధానాలను ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నాం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడంతో స్క్రాపేజీ పాలసీని ప్రవేశ పెడితే ఆటో రంగం పుంజుకుంటుంది.