మెట్రో కోచ్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: మెట్రో పట్టాలపై పరుగులు తీయనున్న బోగీ (కోచ్) నమూనా హైదరాబాద్‌కు చేరుకుంది. దక్షిణ కొరియాకు చెందిన హుందయ్ రోటిమ్ సంస్థ తయారు చేసిన ఈ కోచ్ ఇటీవలే చెన్నై నౌకాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సోమవారం ఉదయం ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ కోచ్‌ను అక్టోబర్ 2 నుంచి నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రదర్శనకు పెట్టనున్నారు. వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి, బోగీల్లో మార్పులు చేర్పులు చేపడతారు.