కనుమూరి బాపిరాజు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం
సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు పదవులకు రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని రాష్ట్ర రైతు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివిడు మండలం ఐ. భీమవరంలో నరసాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు నివాసాన్ని బుధ, గురువారం ముట్టడించాలని నేతలు పిలుపు నిచ్చారు.
విభజనను నిరసిస్తూ బాపిరాజు రాజీనామా చేయనందుకు నిరసనగా నేడు, రేపు ఆయన నివాసం వద్ద స్నానాలు, నిద్ర, భోజనాలు అక్కడే చేయాలని రాష్ట్ర రైతు జేఏసీ నేతలు మంగళవారం వెల్లడించిన విషయం విదితమే.