i labs
-
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్కి గురువారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని.. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు కాగా, నకిలీ ఐడీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. ఐ ల్యాబ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ .. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66 డీ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్సీఐటీని మోసం చేసేందుకు నటరాజన్ అనే వ్యక్తి ఐ ల్యాబ్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీని కియేట్ చేశాడని కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇండస్‌లా కంపెనీ.. ఐ ల్యాబ్‌కు పంపిన డాక్యుమెంట్లలో నకిలీ మెయిల్ ఐడీని తాము గుర్తించామన్నారు. నటరాజన్ అనే వ్యక్తి పేరుతో ఎవరూ లేరంటూ.. తమ విలువైన సమాచారం దొంగిలించారని కృష్ణ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్సీఐటీ కేసులో లబ్ది పొందడం కోసం రవిప్రకాశ్ ఈ కుట్ర పన్నారని ఐ ల్యాబ్స్ ఫిర్యాదులో పేర్కొంది. నటరాజన్‌తో రవిప్రకాశ్ ఈ వ్యవహారం మొత్తం నడిపారని సాక్ష్యాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా రవిప్రకాశ్‌ను మియాపూర్ కోర్టుకు తీసుకొస్తున్నారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో మళ్లీ జైలుకు తరలించారు. -
నియామకాల్లో తగ్గుదలతో ఇబ్బందే
హైదరాబాద్: వినూత్న భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఐ ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ వై.శ్రీనిరాజు చెప్పారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో గురువారం ‘టై– ఐఎస్బీ కనెక్ట్ –ది నెక్ట్స్ ట్రిలియన్ –వేర్ అండ్ హౌ టు క్రియేట్’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2007కు ఒక ట్రిలియన్ డాలర్లు, 2015కు రెండు ట్రిలియన్ డాలర్లు, 2019 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల జీడీపీని చేరుకునేలా భారతదేశం ప్రణాళికలు రూపొందించుకుంది. 2017లో ప్రస్తుతం జీడీపీ 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం 7 శాతంగా ఉన్న వృద్ధి రేటు వచ్చే ఐదేళ్లలో రెండింతలు కావాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో భారతదేశంలో ఐటీ రంగంలో నియామకాలు 2.5 లక్షల వరకూ ఉండాల్సి ఉంది. కానీ 1.2 లక్షల మందినే నియమించారు. నియామకాల్లో చోటు చేసుకున్న ఈ గణనీయమైన తగ్గుదల వ్యాపారంపై ప్రభావం చూపిస్తోంది’’ అని శ్రీనిరాజు వివరించారు. ఏషియన్ పెయింట్స్ మాజీ ప్రెసిడెంట్ జలాజ్ అశ్విన్ ధని మాట్లాడుతూ పాతికేళ్ల క్రితం ఏషియన్ పెయింట్స్ సంస్థ టర్నోవర్ వెయ్యి కోట్లని, ఇప్పుడది 1.10 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ప్రధానంగా కొనుగోలు దారులను దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను చేస్తే మార్కెట్ ఉంటుందన్నారు. బీఈ ఇండియా ఎండీ మహిమ దాట్ల మాట్లాడుతూ భారతదేశంలో ఫార్మా రంగానికి ఒకప్పటి స్వర్ణ యుగం ఇప్పుడు లేదన్నారు. ‘‘1948లో ఫార్మా కంపెనీ పెట్టాం. రెండు దశాబ్దాల తరవాత వాక్సిన్ల ఉత్పత్తిలోకి వచ్చాం. ఎన్నో ఇబ్బందులు వచ్చినా మారుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ మనగలిగాం’’ అని చెప్పారు. ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, స్టార్టప్ సంస్థల నిర్వాహకులు, ఐఎస్బీ విద్యార్థులు పాల్గొన్నారు. -
దీపావళి ఉత్సవం