సాక్షి, హైదరాబాద్: టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్‌కి గురువారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని.. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.
రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు
కాగా, నకిలీ ఐడీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. ఐ ల్యాబ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ .. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66 డీ సెక‌్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్‌సీఐటీని మోసం చేసేందుకు నటరాజన్ అనే వ్యక్తి ఐ ల్యాబ్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీని కియేట్ చేశాడని కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇండస్‌లా కంపెనీ.. ఐ ల్యాబ్‌కు పంపిన డాక్యుమెంట్లలో నకిలీ మెయిల్ ఐడీని తాము గుర్తించామన్నారు.
నటరాజన్ అనే వ్యక్తి పేరుతో ఎవరూ లేరంటూ.. తమ విలువైన సమాచారం దొంగిలించారని కృష్ణ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్‌సీఐటీ కేసులో లబ్ది పొందడం కోసం రవిప్రకాశ్ ఈ కుట్ర పన్నారని ఐ ల్యాబ్స్ ఫిర్యాదులో పేర్కొంది. నటరాజన్‌తో రవిప్రకాశ్ ఈ వ్యవహారం మొత్తం నడిపారని సాక్ష్యాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా రవిప్రకాశ్‌ను మియాపూర్ కోర్టుకు తీసుకొస్తున్నారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో మళ్లీ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment