Ravi Prakash arrest
-
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్కి గురువారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని.. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు కాగా, నకిలీ ఐడీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. ఐ ల్యాబ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ .. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66 డీ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్సీఐటీని మోసం చేసేందుకు నటరాజన్ అనే వ్యక్తి ఐ ల్యాబ్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీని కియేట్ చేశాడని కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇండస్‌లా కంపెనీ.. ఐ ల్యాబ్‌కు పంపిన డాక్యుమెంట్లలో నకిలీ మెయిల్ ఐడీని తాము గుర్తించామన్నారు. నటరాజన్ అనే వ్యక్తి పేరుతో ఎవరూ లేరంటూ.. తమ విలువైన సమాచారం దొంగిలించారని కృష్ణ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్సీఐటీ కేసులో లబ్ది పొందడం కోసం రవిప్రకాశ్ ఈ కుట్ర పన్నారని ఐ ల్యాబ్స్ ఫిర్యాదులో పేర్కొంది. నటరాజన్‌తో రవిప్రకాశ్ ఈ వ్యవహారం మొత్తం నడిపారని సాక్ష్యాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా రవిప్రకాశ్‌ను మియాపూర్ కోర్టుకు తీసుకొస్తున్నారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో మళ్లీ జైలుకు తరలించారు. -
రవిప్రకాశ్‌ను విచారిస్తున్న పోలీసులు
-
రవిప్రకాష్ అరెస్ట్
ఏలూరు(సెంట్రల్) : శిశువును విక్రయిస్తు పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన సెల్ఫ్ హెల్ఫ్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకుడు మాల్పూరి రవిప్రకాష్( ఫాదర్ తంబి)ను ఏలూరు రూరల్ పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. స్థానిక వెంకటాపురం పంచాయతీ గణేష్ కాలనీలో ఈ సొసైటీ తరఫున అనాథ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు శనివారం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో నిర్వాహకుడు రవిప్రకాష్ చిన్నారిని విక్రయిస్తూ పట్టుడడ్డాడు. శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని రూరల్ ఎస్సై కిషోర్‌బాబు,హెడ్‌కానిస్టేబుల్ బండారు నాని విచారణ ప్రారంభించారు. రవిప్రకాష్ గతంలో పిల్లలను విక్రయించలేదని వారి విచారణలో తేలింది. బిడ్డ తల్లిదండ్రులే ఏవరికైనా దత్తకు ఇవ్వమని చెప్పడంతోనే బిడ్డను వారికి ఇచ్చేందుకు ఒప్పకున్నానని రవిప్రకాష్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో బిడ్డ తండ్రిని కూడా నిందితుడిగా చేర్చుతున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆదివారం రాత్రి రవిప్రకాష్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచాగా 17రోజులు రిమాండ్ విధించారు. అతడిని సబ్‌జైలుకు తరలించారు. స్టేషన్‌కు వచ్చిన బిడ్డ తల్లిదండ్రులు రవిప్రకాష్ నుండి బిడ్డకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. కామవరపుకోట మండలం కొత్తఊరుకు చెందిన దగ్గుమల్లి మోహన్, జ్యోతిలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారై,ఇద్దరు కుమారులు ఉన్నారు. మోహన్ వంట పనులు చేస్తుంటాడు. బిడ్డ పెంపకం భారం కావడంతో తమకు గతంలో పరిచయం ఉన్న రవిప్రకాష్‌కు శనివారం మధ్యాహ్నం 3గంటలకు బిడ్డను అప్పగించానని. ఉదయం పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చినట్టు బిడ్డ తల్లి జ్యోతి తెలిపింది. బిడ్డను శనివారం రాత్రే చెల్డ్లైన్కు అప్పగించారు.