రవిప్రకాష్ అరెస్ట్ | baby Sells Ravi Prakash arrest | Sakshi
Sakshi News home page

రవిప్రకాష్ అరెస్ట్

Published Mon, Jul 6 2015 1:30 AM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM

రవిప్రకాష్ అరెస్ట్ - Sakshi

రవిప్రకాష్ అరెస్ట్

 ఏలూరు(సెంట్రల్) :  శిశువును విక్రయిస్తు పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన సెల్ఫ్ హెల్ఫ్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకుడు మాల్పూరి రవిప్రకాష్( ఫాదర్ తంబి)ను ఏలూరు రూరల్ పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.  స్థానిక వెంకటాపురం పంచాయతీ గణేష్ కాలనీలో ఈ సొసైటీ తరఫున  అనాథ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు శనివారం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో నిర్వాహకుడు రవిప్రకాష్ చిన్నారిని విక్రయిస్తూ పట్టుడడ్డాడు.
 
  శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని రూరల్ ఎస్సై కిషోర్‌బాబు,హెడ్‌కానిస్టేబుల్ బండారు నాని విచారణ  ప్రారంభించారు. రవిప్రకాష్ గతంలో పిల్లలను విక్రయించలేదని వారి విచారణలో తేలింది. బిడ్డ తల్లిదండ్రులే ఏవరికైనా దత్తకు ఇవ్వమని చెప్పడంతోనే బిడ్డను వారికి ఇచ్చేందుకు ఒప్పకున్నానని రవిప్రకాష్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో బిడ్డ  తండ్రిని కూడా నిందితుడిగా చేర్చుతున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆదివారం రాత్రి రవిప్రకాష్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచాగా 17రోజులు రిమాండ్ విధించారు. అతడిని సబ్‌జైలుకు తరలించారు.
 
  స్టేషన్‌కు వచ్చిన బిడ్డ తల్లిదండ్రులు
 రవిప్రకాష్ నుండి బిడ్డకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. కామవరపుకోట మండలం కొత్తఊరుకు చెందిన దగ్గుమల్లి మోహన్, జ్యోతిలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారై,ఇద్దరు కుమారులు ఉన్నారు. మోహన్ వంట పనులు చేస్తుంటాడు.  బిడ్డ పెంపకం భారం కావడంతో తమకు గతంలో పరిచయం ఉన్న రవిప్రకాష్‌కు శనివారం మధ్యాహ్నం 3గంటలకు బిడ్డను అప్పగించానని. ఉదయం పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చినట్టు బిడ్డ తల్లి జ్యోతి తెలిపింది. బిడ్డను శనివారం రాత్రే చెల్డ్‌లైన్‌కు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement