భారత అభిమానుల చెంతకు మాంచెస్టర్ యునెటైడ్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్ తొలిసారిగా భారత్లో తమ అభిమానులను కలువనుంది. ‘ఐలవ్యునెటైడ్ఇండియా’ పేరిట జరిగే ఈ ఈవెంట్ వచ్చే నెల 17న బెంగళూరులోని యూబీ సిటీకి చెందిన ఆంఫి థియోటర్లో జరుగుతుంది. ఇందులో ఎంయూ అంబాసిడర్ డ్వైట్ యార్క్, క్లబ్ దిగ్గజ ఆటగాడు క్వింటాన్ ఫార్చూన్ పాల్గొని తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. అలాగే ఆరోజు లివర్పూల్తో జరిగే మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అభిమానులకు చూయించనున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టిక్కెట్ల కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇలాంటి కార్యక్రమమే ఫిబ్రవరిలో ముంబైలో నిర్వహిస్తారు.