ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్ తొలగింపు
ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్‌ను తొలగించి, ఆ స్థానంలో శశాంక్ మనోహర్‌ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. సోమవారం ఉదయం ముంబైలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే జూన్ వరకు ఐసీసీలో శ్రీనివాసన్ పదవీకాలం ఉండగా, ఆ స్థానంలో ఇప్పుడు శశాంక్ మనోహర్ ఉంటారు. సాధారణంగా సెప్టెంబర్ నెలాఖరులో వార్షిక సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా, అది దాదాపు నెల రోజులు వాయిదా పడింది. ఇక ప్రయోజనాల వైరుధ్యం విషయంలో కూడా నిబంధనలు కఠినంగా పాటించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కొరడా ఝళిపించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.