ICC Cricket World Cup Super League
-
క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా
క్రికెట్ అయినా.. సినిమా అయినా అభిమానం ఎప్పుడు తారాస్థాయిలో ఉంటుంది. తమకు నచ్చిన మ్యాచ్ లేదా సినిమా నటుడిని చూడడానికి ఎంతవరకైనా వెళ్తారు. తాజాగా నేపాల్‌లో క్రికెట్‌పై అభిమానం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. ఎంతలా అంటే ఒక మ్యాచ్ చూడడం కోసం అక్కడి ఫ్యాన్స్ ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా లెక్క చేయకుండా ఏకంగా చెట్లు ఎక్కి మరీ మ్యాచ్‌లు వీక్షిస్తున్నారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2(2019-23)లో భాగంగా గురువారం నేపాల్‌లోని కిర్తీపూర్ క్రికెట్ గ్రౌండ్లో నేపాల్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు పోటెత్తారు. స్టాండ్స్ మొత్తం ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయారు. టికెట్లు దొరకని వారు గ్రౌండ్ బయట బారికేడ్ల నుంచి మ్యాచ్‌ను వీక్షించారు. అయితే కొంతమంది మాత్రం మ్యాచ్ క్లియర్‌గా కనపడాలన్న ఉద్దేశంతో చెట్లపైకి ఎక్కి వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నేపాల్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి నేపాల్ జట్టు 44 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నేపాల్ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్ షార్కీ 67 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఆరిఫ్ షేక్ 52, గుల్షన్ జా 50 నాటౌట్, కుషాల్ బుర్తెల్ 50 పరుగులు రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఆసిఫ్ ఖాన్ 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అర్వింద్ 94 పరుగులు చేయగా.. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 63 పరుగులతో రాణించాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కి అర్హత సాధించడం నేపాల్, యూఏఈలకు అవసరం. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో నేపాల్ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్, ఒమన్‌లు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. 2023 క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు మరొక జట్టుకు మాత్రమే అవకాశం ఉంది. ఇక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లు తాము ఆడే వన్డే సిరీస్‌ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. एउटा गतिलो स्टेडियम बनाउन नसक्नेहरु किन खेल हेर्न मैदान पुगेका!? यो तस्वीरले गिज्याउँदैन!? लज्जित बनाउँदैन!? अन्तर्राष्ट्रिय मिडियाले कभर गरिरहेका छन् यहाँ!! pic.twitter.com/Cm6hHcAzPG — Nirmal Prasai🇳🇵 (@NirmalPrasai5) March 16, 2023 मैदान बाहिर यत्रो भिड, निश्वार्थ प्रेम र लगाव।💚#NEPvUAE , #nepalcricket , #nepalvsuae pic.twitter.com/UyL8DEfM99 — Nirmal Prasai🇳🇵 (@NirmalPrasai5) March 16, 2023 Update on the #CWCLeague2 match in Nepal: Nepal beat UAE by nine runs via the DLS Method UAE 310/6, 50 overs Nepal 269/6, 44 overs pic.twitter.com/ZgZMbtF7nc — UAE Cricket Official (@EmiratesCricket) March 16, 2023 చదవండి: ఆసీస్ సుందరికి ఎంత కష్టమొచ్చే! చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు -
WC 2023: అఫ్గన్‌పై శ్రీలంక విజయం.. ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా..
Afghanistan tour of Sri Lanka, 2022- Sri Lanka vs Afghanistan, 3rd ODI: అఫ్గనిస్తాన్‌పై విజయంతో ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపరుచుకుంది శ్రీలంక. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించే క్రమంలో ముందడుగు వేసింది. కాగా దసున్ షనక బృందం అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది. మొదటి మ్యాచ్‌లో అఫ్గన్ గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. ఈ క్రమంలో సిరీస్ విజేతను తేల్చే బుధవారం నాటి నిర్ణయాత్మక వన్డేలో ఆతిథ్య లంక 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. PC: ICC ఈ విజయంతో పది పాయింట్లు ఖాతాలో వేసుకున్న శ్రీలంక.. ఐర్లాండ్‌ను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 77 పాయింట్లతో ఉన్న దసున్ షనక బృందం..ఈ సైకిల్లో మరో మూడు వన్డేలు ఆడనుంది. వీటిలో కనీసం రెండు గెలిచినా వెస్టిండీస్‌ను వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకుతుంది. తద్వారా ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. మరోవైపు అఫ్గన్ ఈ టేబుల్లో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. కాగా టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా క్వాలిఫై అవుతాయన్న విషయం తెలిసిందే. శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్ వేదిక: పల్లకెలె టాస్: అఫ్గనిస్తాన్.. బ్యాటింగ్ అఫ్గనిస్తాన్ స్కోరు: 313-8 (50 ఓవర్లలో) శ్రీలంక స్కోరు: 314-6 (49.4 ఓవర్లలో) విజేత: నాలుగు వికెట్ల తేడాతో లంక గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: చరిత్ అసలంక (72 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 83 పరుగులు.. నాటౌట్) అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్: ఇబ్రహీం జద్రాన్ (138 బంతుల్లో 162 పరుగులు) చదవండి: Shikhar Dhawan: పంత్‌కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే! Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే.. SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే.. -
WC 2023: టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్
ICC Cricket World Cup Super League- Team India Top: శ్రీలంక పర్యటనలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు వరుణుడు ఉపకారం చేశాడు. వర్షం కారణంగా లంకతో రెండో వన్డే రద్దు కావడంతో అఫ్గన్ ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించేందుకు మార్గం మరింత సుగమమైంది. కాగా మూడు వన్డేల సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది బృందం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా పల్లకెలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అఫ్గన్ జట్టు. అయితే, ఆదివారం నాటి రెండో వన్డేలో అఫ్గనిస్తాన్ 228 పరుగులు మాత్రమే స్కోరు చేసి ఆలౌట్ అయింది. దీంతో పర్యాటక జట్టును కట్టడి చేయగలిగిన లంకకు సిరీస్‌ను సమం చేసే అవకాశం దక్కింది. అయితే, వరుణుడు ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. అప్పటికి 2.4 ఓవర్లలో లంక స్కోరు: 10-0. అఫ్గనిస్తాన్ లైన్ క్లియర్ ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఇరు జట్లకు 5 పాయింట్లు వచ్చాయి. దీంతో ఇప్పటికే 110 పాయింట్లతో ఉన్న అఫ్గనిస్తాన్ 115 పాయింట్లతో ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో ఏడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశానికి మరింత చేరువైంది. లంక కష్టమే! మరోవైపు.. లంక మాత్రం 67 పాయింట్లతో ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. ఇక శ్రీలంకకు ఈ వరల్డ్‌కప్ సైకిల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లే మిగిలి ఉండటంతో ఆ జట్టు టాప్-8కు చేరుకునే అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. అయితే, ప్రస్తుత సిరీస్‌లో మూడో వన్డేలో గనుక అఫ్గన్‌ను ఓడిస్తే వాళ్లకు 10 పాయింట్లు లభిస్తాయి. దీంతో వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో ఎనిమిదో స్థానం కోసం పోటీపడే అవకాశం ఉంటుంది. టాప్‌లో టీమిండియా.. పైకి ఎగబాకిన కివీస్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న కారణంగా మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా క్వాలిఫై అయింది. ఐసీసీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టిక(PC: ICC) అయినప్పటికీ 134 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా టీమిండియా కొనసాగుతుండటం విశేషం. మరోవైపు.. భారత్‌తో రెండో వన్డే ఫలితం తేలకుండా ముగియడంతో న్యూజిలాండ్ 125 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్.. IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? Handshakes 🤝 all around after Afghanistan's 2⃣nd ODI match against Sri Lanka has been called off due to persistent rain 🌧️ in Kandy. We go again on Wednesday for the third & final ODI of the series. #AfghanAtalan | #CWCSL | #AFGvSL | #SuperCola | #KamAir pic.twitter.com/qfEyDhET6x — Afghanistan Cricket Board (@ACBofficials) November 27, 2022