breaking news
ICC ODI ranking
-
దుమ్ములేపిన సౌతాఫ్రికా.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి
ఐసీసీ వన్డే వన్డే ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా దుమ్ములేపింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా టాప్-5లోకి దూసుకొచ్చింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేకు ముందు ప్రోటీస్ జట్టు ఆరో స్ధానంలో ఉండేది.అయితే ఇంగ్లండ్‌పై అద్బుత విజయం సాధించడంతో సౌతాఫ్రికా.. పాకిస్తాన్‌ను వెనుక్కి నెట్టి ఐదో స్ధానానికి చేరుకుంది. సఫారీల ఖాతాలో ప్రస్తుతం 101 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఆరో స్దానంలో పాక్ వద్ద 100 రేటింగ్ పాయింట్ల ఉన్నాయి. సౌతాఫ్రికా జట్టు ఇటీవల కాలంలో వన్డేల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.గత నెలలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న సఫారీలు ఇప్పుడు ఇంగ్లీష్ జట్టు భరతం పట్టారు. వరుస సిరీస్ విజయాలతో సౌతాఫ్రికా ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంది. ఇదే జోరును సౌతాఫ్రికా కొనసాగిస్తే మరి కొద్ది రోజుల్లో రెండో స్ధానానికి చేరుకునే అవకాశముంది.ప్రస్తుతం వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా టీమిండియా(124 రేటింగ్ పాయింట్లు) కొనసాగుతోంది. ఆ తర్వాత స్ధానాల్లో వరుసగా న్యూజిలాండ్(109), ఆస్ట్రేలియా(106), శ్రీలంక(103) ఉన్నాయి. రెండో ర్యాంక్‌కు చేరాలంటే సౌతాఫ్రికాకు కేవలం 8 రేటింగ్ పాయింట్లు మాత్రమే అవసరం. ఉత్కంఠ పోరులో ప్రోటీస్ విజయం..కాగా లార్డ్స్ వేదికగా నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే దుమ్ములేపాడు.77 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కే.. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (58), డెవాల్డ్ బ్రెవిస్ (42), కార్బిన్ బాష్ (32 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆదిల్ రషీద్ రెండు, జేకబ్ బెతెల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. సేన్ ముత్తుస్వామి అద్బుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి.చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో.. -
కోహ్లికి రెండో ర్యాంక్
దుబాయ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరపున వన్డే కెప్టెన్ ధోని, శిఖర్ ధావన్, మాత్రమే టాప్ టెన్ లో ఉన్నారు. సిడ్నీ టెస్టులో భారత్ కు నాయకత్వం వహిస్తున్న కోహ్లి 862 పాయింట్లులో రెండో ర్యాంక్ లో నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డీవిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ 5, ధోని 10వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా మాత్రమే టాప్ టెన్ లో చోటు సంపాదించారు. భువనేశ్వర్ 8, జడేజా 9వ ర్యాంక్ లో నిలిచారు.