breaking news
ICC ODI World Cup 2027
-
అక్షర్‌తో పాటు వరల్డ్‌కప్ జట్టులో అతడూ ఉండాలి.. ఎందుకంటే...
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 (ICC ODI WC 2027) కోసం టీమిండియా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కెప్టెన్‌ను మార్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వెల్లడించాడు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్లు స్పష్టం చేశాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్క్ సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను సెలక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే.సెలక్షన్ నా చేతుల్లో లేదుజడ్డూకు మొండిచేయి చూపి స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయంపై జడ్డూ స్పందిస్తూ.. ‘‘సెలక్షన్ నా చేతుల్లో లేదు. అయితే, ఈ టూర్లో ఆడాలని ఆశపడిన మాట వాస్తవమే.కానీ జట్టు యాజమాన్యం, సెలక్టర్లు, కోచ్, కెప్టెన్ ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. నన్ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే, జట్టు ప్రకటనకు ముందే నాతో ఈ విషయం గురించి చర్చించడం సంతోషం కలిగించింది.అందుకే జట్టులో నా పేరు లేనపుడు పెద్దగా ఆశ్చర్యపోలేదు. నన్ను ఎందుకు తప్పించారో చెప్పినందుకు కాస్త ఊరటగా అనిపించింది’’ అని జడేజా కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలు వన్డే వరల్డ్‌కప్ ఆడే విషయంపై హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.తద్వారా దిగ్గజ బ్యాటర్లను మెగా టోర్నీ దాకా కొనసాగించే పరిస్థితి లేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జడ్డూకు కూడా రో-కో మాదిరి తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి జడ్డూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.భారత జట్టులో అతడు తప్పక ఉండాలిఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు 2027 వరల్డ్‌కప్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో దయచేసి రవీంద్ర జడేజా పేరు విస్మరించకండి. అతడు కూడా ప్రణాళికల్లో ఉంటాడు. ఇందులో సందేహానికి తావులేదు.ఇప్పటికీ ఏడు- ఎనిమిదేళ్ల క్రితం మాదిరే అతడు ఫీల్డింగ్ చేస్తున్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. బంతి కోసం అతడు పాదరసంలా పరుగులు తీస్తుంటే చూడటం ముచ్చటగా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాతో వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నేను అర్థం చేసుకోగలను. అయితే, వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి వేదికైన సౌతాఫ్రికాలో పిచ్ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్షర్ పటేల్‌తో పాటు రవీంద్ర జడేజా తప్పక జట్టులో ఉండాలి’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డేలో గిల్ సేన ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
‘అగార్కర్, గంభీర్‌లను తొలగిస్తేనే సరి!’.. సిగ్గు పడండి!
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu)కు కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ ఓపెనర్ మండిపడ్డాడు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దంటూ సదరు నెటిజన్‌కు చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. మొహమ్మద్ షమీని కాదని హర్షిత్ రాణా (Harshit Rana)కు జట్టులో చోటివ్వడం ఇందుకు ప్రధాన కారణాలు.ఏడు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్‌లో గిల్ సేన ఆసీస్ చేతిలో.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం విజేతను తేల్చారు.అగార్కర్, గంభీర్‌లను తొలగిస్తేనే సరి?ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధు.. గంభీర్, అగార్కర్‌లను ఘాటుగా విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. జాడ్ ఇన్సానే అనే అకౌంట్ నుంచి ‘‘ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలవాలనుకుంటే.. బీసీసీఐ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్‌లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి.అదే విధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలి’’ అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతీ, అగార్కర్ల ఫొటోలను కూడా సదరు నెటిజన్ జతచేశారు.సిగ్గు పడండిఈ విషయంపై స్పందించిన సిద్ధు.. ‘‘నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి. అసలు ఇలాంటివి కూడా చేస్తారని అస్సలు ఊహించలేదు. సిగ్గు పడండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
Ro- Ko వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్‌కప్‌లో ఆడతారా?: అగార్కర్
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నమెంట్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్లను ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. రో- కో వన్డే ప్రపంచకప్ ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు.ఆడుతూనే ఉంటాం అనే సందేశంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత కోహ్లి.. ‘‘మీరు ఎప్పుడైతే ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడే నిజంగా మీరు విఫలమైనట్లు’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తద్వారా తాను ఇంకొన్నాళ్లు ఆటలో కొనసాగే అవకాశం ఉందంటూ పరోక్షంగా అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు.మరోవైపు.. 38 ఏళ్ల రోహిత్ శర్మ సైతం ఇటీవలే పది కిలోల బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా చివరగా టీమిండియా తరఫున బరిలో దిగిన రో-కో.. ఆసీస్‌తో అక్టోబరు 19 నాటి తొలి వన్డేతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లుఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రో- కో భవితవ్యంపై మరోసారి స్పందించాడు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం వాళ్లిద్దరు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లు. వరల్డ్‌కప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. యువ ఆటగాళ్లు వీరి స్థానాలను ఆక్రమిస్తారేమో.. చెప్పలేము కదా!.. లేదంటే యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కదేమో!ఏదేమైనా రోహిత్- కోహ్లి.. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. ప్రతి మ్యాచ్ తర్వాత వారి ప్రదర్శన గురించి శల్య పరీక్ష చేయడం ఉండదు. వాళ్లు ఆడటం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం.వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్‌కప్‌లో ఆడతారా?కేవలం పరుగులు చేయడం కాదు.. ట్రోఫీ గెలవడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆస్ట్రేలియాలో రోహిత్- కోహ్లి వరుసగా మూడు సెంచరీలు చేసినంత మాత్రాన.. వారు వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతారనే గ్యారెంటీ లేదు కదా!..అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే మా నిర్ణయం ఉంటుంది’’ అంటూ రోహిత్- కోహ్లిలకు మరో మెగా టోర్నీ ఆడే అవకాశం ఇవ్వకపోచ్చని అగార్కర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.అదే సమయంలో తాము సీనియర్ ఆటగాళ్లకు అత్యంత గౌరవం ఇస్తామని.. వారితో జరిగే మా సంభాషణలు బయటకు రావు కాబట్టి బయట అందరూ ఏదో ఊహించుకుంటారని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥 Rohit Sharma 🤝 Virat Kohli 🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ— BCCI (@BCCI) October 17, 2025 -
రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్
టీమిండియా వన్డే కెప్టెన్‌ను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar)తో పాటు మదన్ లాల్ వంటి వారు సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా భారత వన్డే జట్టు కెప్టెన్ మార్పు అంశంపై తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మను తప్పించి గిల్‌ను కెప్టెన్‌ను చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు వివరిస్తూ..రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli).. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు ఆడతారో లేదో నమ్మకం లేదు. ఆ ఆలోచనతోనే శుబ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా చేసి ఉంటారు. అతడికి గొప్ప అవకాశం లభించింది.యువకుడు.. బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడిగా ఎదగగలడు. రోహిత్, కోహ్లి జట్టులో ఉండగానే గిల్‌ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. ఈ ఇద్దరు గొప్ప, అనుభవజ్ఞులైన కెప్టెన్ల నుంచి గిల్ ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.రోహిత్, కోహ్లి జట్టులో కొనసాగాలంటే..వారి అనుభవం తనకు ఉపయోగపడుతుంది. కెప్టెన్‌గా ఎదిగే క్రమంలో అతడికి ఇది ఎంతో ముఖ్యం. వాళ్లిద్దరు జట్టులో ఉండటం గిల్‌కు సానుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ రోహిత్, కోహ్లి 2027 వరల్డ్‌కప్ వరకు కొనసాగాలనుకుంటే.. తప్పకుండా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది.సెలక్టర్లకు బ్యాట్ ద్వారానే సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీని దాటి ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా పరుగులు చేయాల్సిందే. రోహిత్, కోహ్లి వరల్డ్‌కప్ వరకు జట్టులో ఉంటే.. టీమిండియాకు అంతకంటే గొప్ప ఆస్తి మరొకటి ఉండదు’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.ఆసీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీకాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. చివరగా ఇద్దరూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌తో రో- కో పునరాగమనం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ జట్టును ముందుకు నడిపిస్తుండగా.. టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
వన్డే కెప్టెన్‌గా ఎంపిక.. శుబ్‌మన్ గిల్ రియాక్షన్ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల శుబ్‌మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వన్డే, టీ20 జట్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. అతడి స్థానంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027 (ICC ODI World Cup 2027) టోర్నీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంఈ నేపథ్యంలో తాను వన్డే కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ స్పందించాడు. ‘‘వన్డే క్రికెట్లో జాతీయ జట్టును ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. చాంపియన్ జట్టుకు సారథిగా ఎంపిక కావడం గర్వంగా ఉంది. నేను కూడా జట్టును గొప్పగా ముందుకు నడిపించాలనే ఆశిస్తున్నా.వరల్డ్‌కప్ కంటే ముందు మేము 20 వరకు వన్డేలు ఆడబోతున్నాము. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ టోర్నీకి మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. వరల్డ్‌కప్ గెలుస్తాం’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.రోహిత్ ఖాతాలో రెండుకాగా చివరగా 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా.. 2023లో సొంతగడ్డపై రోహిత్ శర్మ కెప్టెన్సీలో రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈ ఏడాది ఐసీసీ వన్డే చాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం విజేతగా నిలిచింది. తద్వారా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో రెండు ఐసీసీ టైటిళ్లు చేరాయి. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలోనూ కెప్టెన్ హోదాలో రోహిత్ భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే.అనూహ్య రీతిలోఆ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన రోహిత్ శర్మ పది కిలోల బరువు తగ్గి ఫిట్నెస్ను మరింత మెరుగుపరచుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో అనూహ్య రీతిలో కెప్టెన్సీ కోల్పోయాడు. కాగా 2027లో సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఉమ్మడిగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం


