ICC World Cup 2020
-
ఏడాది దాటిపోయింది.. ఇంతవరకు ప్రైజ్‌మనీ చెల్లించలేదు
ముంబై: టీమిండియా మహిళల జట్టుపై బీసీసీఐ వివక్ష చూపించిందంటూ వారం క్రితం సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌కు పర్యటనకు టీమిండియా పురుషులు జట్టు, మహిళల జట్టు ఏకకాలంలో బయల్దేరాల్సి ఉంది. అయితే ఇరు జట్లు ఒకే ఫ్లైట్‌లో వెళ్లరని.. మహిళల జట్టుకోసం మరో చార్టడ్ ఫ్లైట్ సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇక కరోనా టెస్టుల విషయంలోనూ వివక్ష చూపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఖండించిన బీసీసీఐ మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ లాంటి సీనియర్ క్రికెటర్లతో మాట్లాడించింది. బీసీసీఐ మాపై ఎలాంటి వివక్ష చూపించలేదని.. మాకు చార్టడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు. తాజాగా జీతాల చెల్లింపు విషయంలో బీసీసీఐ మరోసారి వివక్ష చూపిస్తుందంటూ కొత్త అంశం తెరమీదకు వచ్చింది. పురుషుల జట్టులో ఆటగాళ్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు చెల్లించలేదని సమాచారం. విషయంలోకి వెళితే.. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ 5లక్షల డాలర్లు( భారత కరెన్సీలో రూ.36 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చింది. అయితే ఇంతవరకు బీసీసీఐ ఆ ప్రైజ్‌మనీని మహిళా క్రికెటర్లకు డిస్ట్రిబ్యూట్ చేయలేదని సమాచారం. టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొన్న 15 మంది జట్టులో ఒక్కో ప్లేయర్‌కి 33వేల డాలర్లు అందుతుంది( ఇండియన్ కరెన్సీలో రూ. 24లక్షలు). దీనివల్ల మహిళ క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అదే పురుష క్రికెటర్లు ఒక సిరీస్ ఆడిన వారానికే వారి ఖాతాల్లో డబ్బులు వచ్చి చేరతాయి.. కానీ మహిళల జట్టు విషయానికి వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది. ఇదే విషయమై ఫిమేల్ క్రికెట్ ఫెడరేషన్ సభ్యులు స్పందించారు. ''బీసీసీఐకి పురుష క్రికెటర్లపై ఉన్న ప్రేమ మహిళల క్రికెటర్లపై ఎందుకు లేదు. ఏడాది క్రితం ఐసీసీ ఇచ్చిన ప్రైజ్‌మనీని ఇప్పటివరకు ఆటగాళ్లకు చెల్లించలేదు. దీనికి వివక్ష అనకుండా ఇంకేం అంటారో మీరే చెప్పిండి. సమయానికి ఆ డబ్బు అందించి ఉంటే కరోనా, లాక్డౌన్ సమయాల్లో వారికి ఎంతగానో ఉపయోగపడేవి. కాగా ఈ వార్తలపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చదవండి: షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్ తల్లికి సాయం టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
ప్రపంచకప్ వాయిదా.. పాక్‌కు కడుపు మంట
ఇస్లామాబాద్: అందరూ భావించినట్లే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ వాయిదా పడనుంది. గురువారం అన్ని దేశాల బోర్డు సభ్యులతో నిర్వహించనున్న టెలీ కాన్ఫరెన్స్ అనంతరం ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రపంచకప్ వాయిదా పడనుండటంతో అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించుకోవడానికి మార్గం సుగుమం అయినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ వాయిదా పడినదానికంటే ఐపీఎల్ జరిగే అవకాశం ఉండటాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జీర్ణించుకోలేకపోతుంది. (వాయిదా వైపే అడుగులు) ‘టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. ఇది మే నెలనే ఇంకా కనీసం రెండు నెలలైన వేచిచూడాలి. రెండు నెలల తర్వాత కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటుగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే క్రికెట్ క్యాలెండర్ ప్రకారం పాక్, విండీస్ జట్లు ఇంగ్లండ్‌లో సిరీస్ ఆడే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ అనేది ఓ దేశీయ టోర్నీ. దానిని బీసీసీఐ నిర్వహిస్తోంది ఐసీసీ కాదు. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయిస్తామంటే మేం వ్యతిరేకిస్తాం. ఐసీసీ ఈవెంట్స్, ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తాము. వాటి స్థానాల్లో దేశీయ టోర్నీలకు మేం మద్దతివ్వం’ అంటూ పీసీబీకి చెందిని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇక పీసీబీకి ప్రపంచకప్ వాయిదా పడుతుందనే బాధ లేదని ఐపీఎల్ నిర్వహిస్తారనే కడుపు మంట ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) -
టీ20 ప్రపంచకప్ వాయిదా? రేపు క్లారిటీ!
దుబాయ్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్-నవంబర్‌లో జరిగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలో ఈ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. దీంతో ఈ సమావేశం తర్వాతనే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు ఐసీసీ వర్గాలు అందించిన అనధికారిక సమాచారం ప్రకారం అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచకప్ నిర్వహణకు ఆసీస్ కరోనా నిబంధనలు ప్రతిబంధకంగా మారినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ పర్యాటక వీసాలను ఆస్ట్రేలియా రద్దు చేయడం, సెప్టెంబర్ వరకు ఆసీస్‌లో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో టోర్నీ ఏర్పాట్లు సాధ్యమయ్యేలా కనిపించకపోవడం, ఆటగాళ్ల క్వారంటైన్ వంటి తదితర కారణాలతోనే ఈ మెగా టోర్నీ వాయిదా పడే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచశ్రేణి, మాజీ ఆటగాళ్లు సైతం ప్రస్తుత తరుణంలో ప్రపంచకప్ కంటే ఐపీఎల్ టోర్నీనే ఉత్తమమని సూచిస్తుండటంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన గురువారం వెలువడే అవకాశం ఉంది. చదవండి: 'భజ్జీ ! మెల్లిగా.. బిల్డింగ్ షేక్ అవుతుంది' 'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు' T20 World Cup is likely to be postponed till 2022, no official announcement yet: ICC sources pic.twitter.com/NNkfceZsS2 — ANI (@ANI) May 27, 2020