బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీపీఎస్ అధికారులు
కర్నూలు: ఐసీపీఎస్ అధికారులు శనివారం రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వివరాలు...లింగమయ్య(19), రమేశ్(18) అనే ఇద్దరు యువకులకు మరో ఇద్దరు యువతులతో ఆదివారం రంగాపురం గ్రామంలో వివాహం జరుగనుంది. ఈ సమాచారం తెలిసిన ఐసీపీఎస్ అధికారులు గ్రామానికి చేరుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కనీస వయసు లేకుండా పెళ్లి చేస్తే రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష పడేలా చేస్తామని అధికారులు వారిని హెచ్చరించారు.
(పెద్దకడుబూరు)