బక్రీద్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు!
న్యూఢిల్లీ: ఈద్ ఉల్ జుహా(బక్రీద్) పండగ సందర్భంగా హోల్ సేల్ కమాడిటి మార్కెట్లకు, మెటల్, స్టీల్ సోమవారం సెలవు ప్రకటించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఫారెక్స్, మనీ, కమాడిటి ఫ్యూచర్ (ఎన్ సీడీఎక్స్, ఎంసీఎక్స్) మార్కెట్ల కూడా హాలీడే ప్రకటించారు.
అయితే బులియన్ మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి. స్టాక్ మార్కెట్ లో అక్టోబర్ 2, దసరా, వారాంతపు సెలవు దినాల కారణంగా వరుసగా సెలవు దినాల్ని పాటిస్తోంది. మంగళవారం మార్కెట్ సూచీలన్ని తమ వ్యాపారా లావాదేవిలు ప్రారంభమవుతాయి.