విద్యార్ధినిని కోర్చిక తీర్చమన్న లెక్చరర్ అరెస్ట్
కాకినాడ: విద్యార్థులు నేర్పించాల్సిన గురువు పెడతోవ పట్టాడు. శిష్యురాలిపై కన్నేసి ఆమెను లైంగికంగా వేధించాడు. నలుగురు విద్యార్థులతో కలిసి ఆమెకు నరకం చూపించాడు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడింది.
కాకినాడ ఐడీఎల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని వేధిస్తున్న లెక్చరర్, నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కోర్చిక తీర్చకపోతే చంపేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. చివరకు ఆమె ధైర్యం చేసి టుటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.