స్వగ్రామానికి పాల్వాయి మృతదేహం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి మృతదేహాన్ని గాంధీభవన్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించారు. పాల్వాయి స్వగ్రామం అయిన నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటనలో భాగంగా కులుమనాలికి వెళ్లిన ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉదయం గాంధీభవన్లో పలువురు నేతలు పాల్వాయి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పాల్వాయి మృతి పార్టీకి తీరనిలోటు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు.