సిరియా జైలుపై వైమానిక దాడి: 16 మంది మృతి
బీరట్: సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఇడ్లిబ్ నగరంలోని ఓ జైలుపై శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 16 మంది మరణించారు. మృతుల్లో జైలు ఖైదీలు, సిబ్బంది కూడా ఉన్నారని సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ తెలిపింది. రష్యా దళాలు ఈ వైమానిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు రష్యా.. తిరుగుబాటు చేస్తున్న ప్రతిపక్షానికి టర్కీ మద్దతుగా ఉండటం తెలిసిందే.
దాడి అనంతరం జైలు నుంచి కొంతమంది ఖైదీలు పారిపోతుండగా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లోనూ కొంతమంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇడ్లిబ్ నగరంపై సిరియా, రష్యా, అమెరికా సంకీర్ణ దళాలు తరచుగా దాడులు చేస్తుంటాయి. సిరియాలో ఆరేళ్ల క్రితం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఘర్షణల్లో 3.2 లక్షల మంది మరణించారు.