IECC
-
G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు
అంతర్జాతీయ స్థాయిలో జరిగే అత్యంత కీలకమైన జీ20 సదస్సుకు నభూతో అనే స్థాయిలో ఘనంగా ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. అమెరికా మొదలుకుని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఒకే వేదిక మీదికి రానున్నారు. ఆర్థిక అసమానతలు మొదలుకుని వాతావరణ మార్పుల దాకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై సెపె్టంబర్ 9 నుంచి రెండు రోజుల పాటు లోతుగా చర్చించనున్నారు. ఐక్యత, సమష్టి కార్యాచరణే ఆయుధాలుగా పరిష్కార మార్గాలు అన్వేషించనున్నారు. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి, పేరు ప్రతిష్టలు కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. దేశాల మధ్య అతి జటిలమైన సమస్యల పరిష్కారానికైనా, వివాదాల్లో మధ్యవర్తిత్వానికైనా అన్ని దేశాలూ భారత్ వైపే చూసే పరిస్థితి! ఇప్పుడు జీ20 శిఖరాగ్రానికి భారత్ వేదికగా నిలుస్తుండటాన్ని అందుకు కొనసాగింపుగానే భావిస్తున్నారు. మన దేశ వ్యవహార దక్షతను నిరూపించుకోవడానికి మాత్రమే గాక అంతర్జాతీయ స్థాయిలో సంలీన వృద్ధి, సుస్థిర అభివృద్ధి సాధన యత్నాలకు అజెండా నిర్దేశించేందుకు కూడా ఇది చక్కని అవకాశంగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెరపైకి తెచి్చన వసుధైవ కుటుంబకం (ఒక వసుధ, ఒకే కుటుంబం, ఒకటే భవిత) నినాదమే సదస్సుకు మూలమంత్రంగా నిలవనుంది. రెండు రోజులు.. మూడు సెషన్లు ► దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక ప్రగతి మైదాన్‌లో సదస్సు జరగనుంది. ► వేదికకు భారత్ మండపం అని నామకరణం చేశారు. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 7వ తేదీనే భారత్‌కు రానున్నారు. 8న మిగతా దేశాధినేతలు వస్తారు. దాంతో వారితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలకు కావాల్సినంత సమయం చిక్కనుంది. ► 8న బైడెన్‌తో మోదీ భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీ ఎజెండా ఏమిటన్నది ఇప్పటికైతే సస్పెన్సే. తొలి రోజు ఇలా... ► సదస్సు 9న మొదలవుతుంది. ► ప్రతి దేశాధినేతకూ భారత్‌మండపం వద్ద మన సంప్రదాయ రీతుల మధ్య ఘన స్వాగతం లభించనుంది. ► రెండు రోజుల సదస్సులో మొత్తం మూడు సెషన్లు జరుగుతాయి. ► ఒకే వసుధ (వన్ ఎర్త్) పేరుతో తొలి సెషన్ శనివారం ఉదయం 9కి మొదలవుతుంది. ► దానికి కొనసాగింపుగా దేశాధినేతల మధ్య అధికార, అనధికార భేటీలుంటాయి. ► అనంతరం ఒకే కుటుంబం (వన్ ఫ్యామిలీ) పేరుతో రెండో సెషన్ మొదలవుతుంది. రెండో రోజు ఇలా... ► సదస్సు రెండో రోజు ఆదివారం కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి. ► దేశాధినేతలంతా ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. గాం«దీజీ సమాధి వద్ద నివాళులరి్పస్తారు. ► అనంతరం భారత్ మండపం వేదిక వద్ద మొక్కలు నాటుతారు. పర్యావరణ పరిరక్షణకు పునరంకితం అవుతామని ప్రతినబూనుతారు. ► ఒకే భవిత (వన్ ఫ్యూచర్) పేరిట జరిగే మూడో సెషన్‌తో సదస్సు ముగుస్తుంది. ► జీ20 అధ్యక్ష బాధ్యతలను వచ్చే ఏడాది శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్‌కు అప్పగించడంతో సదస్సు లాంఛనంగా ముగుస్తుంది. ప్రథమ మహిళల సందడి ► జీ20 సదస్సులో ఆయా దేశాధినేతల సతీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ► పలు ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు. ► శనివారం తొలి రోజు వాళ్లు పూసా లోని వ్యవసాయ పరిశోధన సంస్థ, నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ సందర్శిస్తారు. ► తృణ ధాన్యాల పరిరక్షణ, వృద్ధిలో భారత్ చేస్తున్న కృషిని స్వయంగా గమనిస్తారు. ► చివరగా పలు రకాల షాపింగులతో సేదదీరుతారు. ► రెండో రోజు ఆదివారం దేశాధినేతల అనంతరం వాళ్లు కూడా రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. మరెన్నో విశేషాలు... ► ప్రతినిధుల షాపింగ్ కోసం క్రాఫ్ట్స్ బజార్ పేరిట వేదిక వద్ద జీ20 జాబ్ ఫెయిర్ ఏర్పాటు చేస్తారు. ► ప్రజాస్వామ్యాలకు తల్లి భారత్ థీమ్‌తో çహాల్ నంబర్ 14లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. షడ్రసోపేత విందు ► శనివారం తొలి రోజు సదస్సు అనంతరం రాత్రి ఆహూతులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇవ్వనున్నారు. ► ఇందులో దేశాధినేతలు మొదలుకుని రాయబారులు దాకా 400 మంది దాకా పాల్గొంటారు. ► విందు కూడా అధినేతల చర్చలకు వేదిక కానుంది. కాన్ఫరెన్స్ గదుల రొటీన్‌కు దూరంగా ఆరుబయట వారంతా మనసు విప్పి మాట్లాడుకుంటారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
ITPO complex: ‘భారత మండపం’ రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ–20 సదస్సుకి వేదిక సిద్ధమైంది. సెపె్టంబర్లో జరగనున్న ఈ సదస్సుకి అమెరికా, బ్రిటన్, చైనా సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సుని నిర్వహించడానికి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ)కు కొత్తగా హంగులు చేకూర్చారు. మరమ్మతులు నిర్వహించి ఆధునీకరించారు. ఈ సెంటర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి దానికి కొత్తగా భారత మండపం అని పేరు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఇతర మంత్రుల సమక్షంలో డ్రోన్ ద్వారా ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ఐఈసీసీ కాంప్లెక్స్‌ని జాతీయ ప్రాజెక్టు కింద రూ.2,700 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఒ) కాంప్లెక్స్‌లో ఇది భాగంగా ఉంది. అంతకు ముందు ప్రధాని మోదీ ఐటీపీఒలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాంప్లెక్స్ మరమ్మతు పనుల్లో పాల్గొన్న కార్మికుల్ని ప్రధాని సత్కరించారు. ప్రగతి మైదాన్ దాదాపుగా 123 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. భారత్‌లో అంతర్జాతీయ సదస్సులు , పారిశ్రామిక సమావేశాలు నిర్వహించే కాంప్లెక్స్‌లో అతి పెద్దది. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐఈసీసీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన టాప్ –10 వేదికల్లో ఒకటి. మూడో అంతస్తులు ఏడువేల మంది పట్టే ఒక కాన్ఫరెన్స్ హాలు ఉంది. జీ–20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారతీయత ఉట్టిపడేలా దీనిని నిర్మించడంతో భారత మండపం అని పేరు పెట్టారు. -
రీ డెవలప్ చేసిన ఐఈసీసీ ఆవిష్కారం: అద్బుతమైన ఫోటోలు
-
అద్భుతమైన ఐఈసీసీ: ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ఢిల్లీ: ఢిల్లీలో రీ డెవలప్ చేసిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవన్ పూజ నిర్వహించారు. ప్రగతి మైదాన్‌లో బుధవారం అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఈ అద్భుత నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని మోదీ సత్కరించారు, వారితో సంభాషించారు.123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2700 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జరిగే భారీ ప్రారంభోత్సవ వేడుక కోసం ఆయన తిరిగి ఐటీపీఓకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా G20 స్టాంప్, నాణేలను ప్రధాని మోదీ విడుదల చేస్తారు. ప్రధాన మంత్రి బుధవారం సాయంత్రం పునరుద్దరించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను అధికారికంగా ప్రారంభించి, ప్రసంగిస్తారు. ఈ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, యాంఫీథియేటర్‌లతో సహా బహుళ అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉందనీ, సమావేశాలను నిర్వహించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలనే మోదీ దృష్టికి అనుగుణంగా ఈ సెంటర్ రూపుదిద్దుకుందని పీఎంవో ప్రకటించింది. Visuals of PM Modi performing Hawan Pujan at the inauguration of the redeveloped ITPO complex in Delhi. Several Union ministers are also present at the event. (Source: Third Party) pic.twitter.com/JsNtfV2Thq — Press Trust of India (@PTI_News) July 26, 2023 ITPO కాంప్లెక్స్ అని కూడా పిలుస్తున్న ఈ కాంప్లక్స్‌లో పెద్ద ఎత్తున ఈవెంట్లు, ట్రేడ్ ఫెయిర్లు, కాన్ఫరెన్స్‌లు ఎగ్జిబిషన్లకు కీలక వేదిక కానుంది. ఈ భవన సముదాయం భారతదేశం పారిశ్రామిక వృద్ధి, వాణిజ్యం, సాంస్కృతిక పరస్పర మార్పిడిని ప్రోత్సహించడంలో కీలకంగా మారనుంది. అలాగే సెప్టెంబరులో G20 నేతల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్కిటెక్ట్ రాజ్ రేవాల్ రూపొందించిన, దేశానికి స్వాతంత్ర్యం పొందిన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మించిన హాల్ ఆఫ్ నేషన్స్‌తో సహా ఇప్పటికే ఉన్న అనేక ఎగ్జిబిషన్ హాల్స్ కూల్చివేయబడిన తర్వాత 2017లో పునరాభివృద్ధికి సంబంధించిన పని ప్రారంభమైంది. వసుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంతో ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్దఎంఐసీఐ (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) కీలకవేదిక. ఆస్ట్రేలియాలోని ఐకానిక్ సిడ్నీ ఒపెరా హౌస్‌లో సీటింగ్ సామర్థ్యం 5500 కంటేమించి కన్వెన్షన్ సెంటర్ లెవల్ 3 వద్ద.. 7,000 సీటింగ్ సామర్థ్యం తో ఇది నిర్మాణమైంది. తద్వారా జర్మనీలోని హన్నోవర్ ఎగ్జిబిషన్ సెంటర్, షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (ఎన్ఈసీసీ)మాదిరిగా ఈ కాంప్లెక్స్ కూడా ప్రపంచంలోని టాప్ 10 ఎగ్జిబిషన్ , కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా ఉంది,.