IITs placements
-
పీజీ టెకీలకు భారీ ఆఫర్లు
సాక్షి,న్యూఢిల్లీ: ఐఐటీ పీజీ స్టూడెంట్లకు ఈ ఏడాది భారీ డిమాండ్ నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీల్లో వివిధ స్ధాయిల్లో పనిచేసేందుకు అభ్యర్ధుల వేటలో కంపెనీలు ఐఐటీల వైపు దృష్టి సారించాయి. ఈ ఏడాది చెన్నయ్, కాన్పూర్, రూర్కీ ఐఐటీల్లో పీజీ విద్యార్థులకు ఆఫర్లు 30 శాతం మేర పెరగ్గా, ప్రముఖ ఐఐటీల్లో పీజీ స్టూడెంట్లకు ఆఫర్లు 90 శాతం మేర పెరిగాయి.దశాబ్ధం కిందట ప్రారంభమైన ఐఐటీల్లో పీజీ స్టూడెంట్లకు ఆఫర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గాంధీనగర్ ఐఐటీలో ఆఫర్లు, టాప్ శాలరీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం. సహజంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పీజీ డిగ్రీ విద్యార్ధుల కంటే అండర్గ్రాడ్యుయేట్ విద్యార్ధులే ఎక్కువ శాతం జాబ్ ఆఫర్లను దక్కించుకుంటారు. అయితే టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, వ్యాపార ధోరణుల్లో మారిన వైఖరులతో ఈసారి పీజీ విద్యార్ధులను పెద్దసంఖ్యలో భారీ ప్యాకేజ్లతో జాబ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. సాంకేతిక బృందాలను పటిష్టం చేసుకోవాలని కంపెనీలు యోచిస్తుండటంతో పెద్దసంఖ్యలో పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ ఆఫర్లు వస్తున్నాయని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ అశోక్ పమిడి చెప్పారు. నూతన టెక్నాలజీల్లో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ పీజీ విద్యార్ధులతో పాటు హ్యుమనిటీస్ పీజీ విద్యార్ధులకూ మెరుగైన ఆఫర్లు వస్తున్నాయి. ఏ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనే దానిపై పీజీ విద్యార్ధులకు మెరుగైన అవగాహన ఉండటంతో కంపెనీలు వారి వైపు మొగ్గుచూపుతున్నాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రీజినల్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ చేపడుతున్న ఏఎండి ఇండియా హెడ్ (హెచ్ఆర్) కిరణ్మయి పెండ్యాల చెప్పారు. ల -
ఐఐటీ ప్లేస్‌మెంట్స్ : తొలిరోజే రూ.1.39 కోట్ల ఆఫర్
తొలి రోజు ఐఐటీ ప్లేస్‌మెంట్స్ మంచి ఊపుతో ప్రారంభమయ్యాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఆఫ్‌షోర్ పొజిషన్లలో భాగంగా వార్షిక వేతనంగా రూ.1.39 కోట్ల వేతన ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ఐఐటీ విద్యార్థులకు ఆఫర్ చేసింది. ఐఐటీ రూర్కే, బొంబై, మద్రాస్, గౌహతి క్యాంపస్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ఈ ఆఫర్ ప్రకటించింది. రూర్కే నుంచి ముగ్గుర్ని, గౌహతికి రెండు ఆఫ్‌షోర్ ఆఫర్లు, ఎనిమిది మందికి దేశీయ ఆఫర్లను అందించింది. మరో టెక్ దిగ్గజం ఆపిల్ కూడా ఈ ఏడాది దేశీయ పొజిషన్ల కోసం ఐఐటీల్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తొలిసారి ఈ కంపెనీ భారత్‌కు ప్లేస్మెంట్లకు వచ్చింది. ప్లేస్మెంట్ ఆఫీసర్ల సమాచారం మేరకు ఈ టెక్నాలజీ దిగ్గజం ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్టు తెలిసింది. మద్రాసు, గౌహతి క్యాంపస్‌లలో ఇది ప్లేస్మెంట్లను చేపట్టిందని వెల్లడైంది. వాల్‌స్ట్రీట్ సూచీ నాస్డాక్ కూడా తొలిసారి మద్రాసు క్యాంపస్‌లో నియామకాలను చేపట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆఫర్లు, వేతన ప్యాకేజీలు స్వల్పంగా పెరిగినట్టు ప్లేస్మెంట్ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకింగ్ సంస్థ బ్లాక్‌స్టోన్ దేశీయ పొజిషన్ల కోసం అత్యధిక మొత్తంలో రూ.35 లక్షల వరకు ప్యాకేజీని ఆఫర్ చేసింది. దేశీయ పొజిషన్లకు అత్యధిక ప్యాకేజీలు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకున్నాయి. డే1లోనే పెద్ద మొత్తంలో ఆఫర్ల వెల్లువ కొనసాగిందని, వచ్చే సెషన్స్‌లో కూడా ఇదే రకమైన స్పందన ఉంటుందని ఆశిస్తున్నామని ఐఐటీ మద్రాసు ప్లేస్మెంట్ డ్రైనింగ్, అడ్వయిజరీ మను శాంతనమ్ తెలిపారు. తొలి స్లాటు ముగిసే లోపు 99 విద్యార్థులు ప్లేస్ అయినట్టు పేర్కొన్నారు. గతేడాది ఈ సంఖ్య 77గానే ఉంది. -
31 కంపెనీలపై నిషేధం ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ : నిబంధనలు ఉల్లంఘించి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న 31 కంపెనీలపై ఐఐటీలు గతేడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతేడాది ఈ కంపెనీలపై విధించిన నిషేధాన్ని ఐఐటీలు ఈ ఏడాది ఎత్తివేశాయి. డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్న వార్షిక క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఈ కంపెనీలు పాల్గొనవచ్చని ఐఐటీలు పేర్కొన్నాయి. ఈ కంపెనీల్లో ఎక్కువగా స్టార్టప్‌లే ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను తిరస్కరించడమే కాకుండా, జాయినింగ్ తేదీల విషయంలో చేస్తున్న జాప్యాన్ని ఐఐటీలు తీవ్రంగా పరిగణించి, గతేడాది ఈ కంపెనీలపై నిషేధం విధించాయి. ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆల్-ఐఐటీ ప్లేస్మెంట్ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలో పాల్గొనే ముందు కంపెనీల ట్రాక్ రికార్డును ఐఐటీలు పరిగణనలోకి తీసుకోవాలని ప్లేస్మెంట్ సెల్‌కు కమిటీ సూచించింది. ఐఐటీ బొంబైలో జరిగిన ఏఐపీసీ 23వ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐపీసీ కోఆర్డినేటర్ తెలిపారు. ఏఐపీసీ బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ పోర్షియా మెడికల్, ఫుడ్ టెక్ కంపెనీ జుమాటో, ఆన్లైన్ సెల్లర్ బేబీ-కేర్ ప్రొడక్టస్ హాప్స్కాచ్లున్నాయి. నిషేధం విధించిన కొన్ని కంపెనీలు ఐఐటీ పూర్వ విద్యార్థులు నడుపుతున్నవే కావడం గమనార్హం. ఒక విద్యార్థి ఒకే ఉద్యోగం సూత్రాన్ని ఐఐటీలు పాటిస్తున్నాయి. ఆన్-క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఒక జాబ్ ఆఫర్ వస్తే, మరిన్ని ఇంటర్వ్యూలకు హాజరుకావడానికి వీలులేదు.