సాక్షి,న్యూఢిల్లీ: ఐఐటీ పీజీ స్టూడెంట్లకు ఈ ఏడాది భారీ డిమాండ్ నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీల్లో వివిధ స్ధాయిల్లో పనిచేసేందుకు అభ్యర్ధుల వేటలో కంపెనీలు ఐఐటీల వైపు దృష్టి సారించాయి. ఈ ఏడాది చెన్నయ్, కాన్పూర్, రూర్కీ ఐఐటీల్లో పీజీ విద్యార్థులకు ఆఫర్లు 30 శాతం మేర పెరగ్గా, ప్రముఖ ఐఐటీల్లో పీజీ స్టూడెంట్లకు ఆఫర్లు 90 శాతం మేర పెరిగాయి.దశాబ్ధం కిందట ప్రారంభమైన ఐఐటీల్లో పీజీ స్టూడెంట్లకు ఆఫర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గాంధీనగర్ ఐఐటీలో ఆఫర్లు, టాప్ శాలరీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం.
సహజంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పీజీ డిగ్రీ విద్యార్ధుల కంటే అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్ధులే ఎక్కువ శాతం జాబ్ ఆఫర్లను దక్కించుకుంటారు. అయితే టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, వ్యాపార ధోరణుల్లో మారిన వైఖరులతో ఈసారి పీజీ విద్యార్ధులను పెద్దసంఖ్యలో భారీ ప్యాకేజ్‌లతో జాబ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. సాంకేతిక బృందాలను పటిష్టం చేసుకోవాలని కంపెనీలు యోచిస్తుండటంతో పెద్దసంఖ్యలో పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ ఆఫర్లు వస్తున్నాయని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ అశోక్ పమిడి చెప్పారు.
నూతన టెక్నాలజీల్లో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ పీజీ విద్యార్ధులతో పాటు హ్యుమనిటీస్ పీజీ విద్యార్ధులకూ మెరుగైన ఆఫర్లు వస్తున్నాయి. ఏ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనే దానిపై పీజీ విద్యార్ధులకు మెరుగైన అవగాహన ఉండటంతో కంపెనీలు వారి వైపు మొగ్గుచూపుతున్నాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రీజినల్ కాలేజీల్లో రిక్రూట్‌మెంట్ చేపడుతున్న ఏఎండి ఇండియా హెడ్ (హెచ్‌ఆర్) కిరణ్మయి పెండ్యాల చెప్పారు. ల
Comments
Please login to add a commentAdd a comment