Iliyaj
-
బాలికపై లైంగిక దాడి
గుంటూరు : మాయమాటలు చెప్పి ఓ బాలికను ఆమె స్నేహితురాలు, స్నేహితురాలి బావ విజయవాడ తీసుకువెళ్లి లైంగిక దాడి చేసిన ఘటనపై లాలాపేట పోలీసులు విచారణ చేస్తున్నారు. సేకరించిన సమాచారం మేరకు గుంటూరులోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న రెహనా జాస్మిన్ తనతోపాటు పనిచేసే సంగడిగుంట ఎల్ఆర్ కాల నీకి చెందిన బాలిక (17)తో స్నేహంగా ఉండేది. జాస్మిన్ బుధవారం విజయవాడలో షాపింగ్ కోసం తన బావతో పాటు కారులో వెళదామని స్నేహితురాలిని ఒప్పించింది. జాస్మిన్ బావ ఇలియాజ్ కారులో ముగ్గురూ విజయవాడ చేరుకున్నారు. విశ్రాంతి కోసం మనోరమ హోటల్లో రూములో దిగారు. జాస్మిన్, ఇలియాజ్ కలసి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాలికకు ఇచ్చారు. మత్తులోకి జారుకున్న బాలికపై ఇలియాజ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తు నుంచి కోలుకున్న అనంతరం ముగ్గురూ గుంటూరు చేరుకున్నారు. తనపై అఘాయిత్యం జరిగిన విషయాన్ని గ్రహించిన బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు గురువారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం. -
ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలి : ఎఐఎస్ఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్ : సాయం కోరుతూ వెళ్లిన అమ్మాయిపై లైంగి క దాడికి పాల్పడిన ఎంఐఎం జిల్లా కన్వీనరు ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలని ఎఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తె లియజేశారు. ఈ సందర్భంగా ఎఐ ఎస్ఎఫ్ నగర కమిటీ ప్రధానకార్యదర్శి కె.మనోహర్ మాట్లాడుతూ ఇ టీవల కదిరి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని సాయం కోరుతూ ఎంఐఎం జిల్లా కన్వీనరు ఇలియాజ్ వద్దకు వెళ్లిం దని, ఆ సమయంలో బాలికను బెది రించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. పది రోజుల కిందట తాడిమర్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఫలితంగా తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటివి పునరావృతం అవుతున్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి ఇలియాజ్పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో ఎఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు రమణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కుళ్లాయప్ప, నాయకులు అనిల్, గి రి, మురళీ, అప్పస్వామి, రామాంజి, రవి, నాగేంద్ర పాల్గొన్నారు.