Illeana
-
కాస్టింగ్ కౌచ్‌పై ఇలియానా..
సాక్షి, న్యూఢిల్లీ : కాస్టింగ్ కౌచ్‌పై దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు మళ్లిన హీరోయిన్ ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం హీరోయిన్లపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఇటీవల పలువురు గళమెత్తడంపై ఇలియానా స్పందించారు. అజయ్ దేవ్గన్తో తాను నటించిన రైడ్ మూవీ ప్రమోషన్లో భాగంగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై తన అభిప్రాయం వెల్లడించారు. సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న ఈ దారుణంపై మాట్లాడితే తమ కెరీర్లు ముగిసిపోతాయనే భయంతో పలువురు హీరోయిన్స్ నోరు మెదపడం లేదనే అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. ‘కాస్టింగ్ కౌచ్‌పై ఎవరైనా మాట్లాడితే వారి కెరీర్ ముగిసినట్టే’ నని ఇలియానా వ్యాఖ్యానించారు. ఓ పెద్ద నిర్మాత తనను వేధిస్తున్నారని కొన్నేళ్ల కిందట దక్షిణాదిలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ తనతో వాపోయారని, ఆయనను ఎలా ఎదుర్కోవాలని తనను అడిగారని ఇలియానా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై తాను చెప్పేదేమీలేదని.. నీవే నిర్ణయించుకోవాలని సూచించానన్నారు. ఇలాంటి సందర్భాల్లో ముందుకెళ్లాలా.. ప్రతిఘటించాలా అన్నది నటులే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. అయితే హీరోయిన్లపై వేధింపులు, అణిచివేతను మాత్రం తాను ఎంతమాత్రం సమర్ధించనని చెప్పారు. బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో తన సంబంధాలపై ఇలియానా స్పందిస్తూ తన వ్యక్తిగత జీవితంపై తాను మాట్లాడబోనని అన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విషయాలు పంచుకుంటానని చెప్పారు. -
సమంత, తమన్నా కంటే కేసీఆర్ అందంగా...: వర్మ
హైదరాబాద్: నా తదుపరి చిత్రం టైటిల్ కేసీఆర్ అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. కేసీఆర్ అనే పదం ఎన్ టీఆర్ అనే పదం కంటే వినడానికి బాగుందని వర్మ మరో ట్విట్ లో పేర్కొన్నారు. ఆధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్ ను అందగాడిని చేశాయి అన్నారు. ఇంకా ఒక అడుగు ముందేసి సమంత, తమన్నా, ఇలియానాలు కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందని వర్మ ట్వీట్ తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్.. కాని కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేశారు. Naa next picture title "KCR" — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014 On every aspect I like the inward sound of a KCR more than the sound of an NTR or a YSR — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014 Just in the sheer power combination of presence, persona and intensity KCR is more beautiful than Samantha,Thamanna and Ileana put together — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014 Hitler was a bad KCR and KCR is a good Hitler — Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2014