ఇసుక మాఫియాకు అడ్డేది..?
రెంజల్ : మండలంలోని కందకుర్తి గ్రామంలో అక్రమ ఇసుక వివాదం రోజురోజుకు ముదురుతోంది. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. బోధన్ మండలం హంగర్గా గ్రామ శివారు మంజీరా నది నుంచి ప్రతిరోజు రాత్రింబవళ్లు యంత్రాలు, డోజర్లతో అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నారు. సుమారు 40 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అటుపక్క దారి లేకపోవడంతో ఇసుక స్మగ్లర్లు కందకుర్తి శివారులో ఇసుకను నిల్వ చేస్తున్నారు. అయితే సన్న, చిన్నకారు రైతులకు చెందిన పంట భూముల్లో ఇసుక నిల్వ చేయడంతో గ్రామంలో వివాదమవుతోంది.
దీనికి తోడు గ్రామం నుంచి అక్రమ క్వారీ వరకు రోడ్డుకు ఇరువైపులగల పిల్ల కాల్వలను పూడ్చివేయడంతో దిగువ భాగంలోని రైతులు సాగు నీరందక ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం పొడి దుక్కులు దున్నుకుని విత్తనాలను విత్తుకునేందుకు పంటలు సిద్ధం చేసి పెట్టుకున్న భూముల్లో ఇసుకను నిల్వ చేయడంతో స్మగ్లర్లు, రైతులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుం టున్నాయి. ఇసుకను నిల్వ చేయడంవల్ల సో యా పంటను ఎలా విత్తుకుంటామని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
తమలో తాము తన్నుక సస్తే అధికారులు మాత్రం తమాషా చూస్తున్నారని విమర్శిస్తున్నారు. మంజీరా నది నుంచి నెల రో జులుగా ఇసుకను తవ్వుతున్నా అధికార యం త్రాంగం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన వివాదం బోధన్ సబ్ కలెక్టర్ వరకు వెళ్ళింది. గ్రామానికి చెందిన రైతు పొలం నుంచి దారి ఏర్పాటు చేసుకుని ఇసుక ట్రాక్టర్లు నడపడంతో ఈ వివాదం తలెత్తింది. అందుకు బాధ్యులైన 20 మందిని సబ్ కలెక్టర్ పిలిచి విచారణ చేశారు.
ఎటు చూసినా ఇసుక నిల్వలే..
కందకుర్తి గ్రామంతోపాటు శివారులో ఎటు చూ సినా అక్రమంగా తోడేసిన ఇసుక నిల్వలే కనిపిస్తున్నాయి. మంజీరా నది నుంచి 24 గంటలు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. సుమా రు 40 ట్రాక్టర్లతో ఇసుకను నిల్వ చేస్తున్నారు. ఇ క్కడి నుంచి జిల్లాతోపాటు పక్క జిల్లాలకు టి ప్పర్ల ద్వారా ఇసుక తరలిపోతోంది. స్మగ్లర్లకు అ డ్డువస్తే దాడులకు కూడా వెనకాడటంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.