బ్యాంకు ఉద్యోగుల అక్రమాలు.. రూ.72 కోట్లు
న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ పెట్టేందుకంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన డీమానిటైజేషన్ ప్రక్రియలో బ్యాంకు ఉద్యోగుల అక్రమాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రూ .500, రూ .1,000 నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ 71.47 కోట్లని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డీమానిటైజేషన్ పీరియడ్లో (నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు) వీరు నగదు మార్పిడికి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని తెలిపింది. పెద్దనోట్ల రద్దు కాలంలో రద్దయిన నోట్ల అక్రమ మార్పిడి, అక్రమ లావాదేవీల్లో 14 కేసుల (శాఖలు) ను గుర్తించినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు మూడు బ్రాంచ్ ల ద్వారా అత్యధికంగా రూ 46.29 కోట్ల లావాదేవీలు జరిగినట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు తెలియజేశారు. ధనలక్ష్మి బ్యాంకుకు చెందిన ఎనిమిది మంది ఉద్యోగులు ఆరు కేసుల్లో నిందితులు. అక్రమంగా మార్పిడి విలువ రూ రూ.22.7 కోట్ల లావాదేవీలు . ప్రభుత్వ రంగ బ్యాంకుల సహా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లోరూ 1.9 కోట్లు (రెండు కేసులు, నాలుగు సస్పెన్షన్లు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ 54.90 లక్షలు, బ్యాంక్ (రెండు కేసులు, ఐదు సస్పెన్షన్లు), సిండికేట్ బ్యాంక్ రూ .6 లక్షలు (ఒక కేసు) అనిమంత్రి తెలిపారు. డీమానిజేషన్ సమయంలో అప్రమంత్తంగా వ్యవహరించాల్సిందిగా అన్నిబ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని సభకు వివరించారు. అక్రమాలకు అడ్డుకోవడంతో పాటు బ్యాంకుల అంతర్గత ఆడిట్ విధానాన్ని బలోపేతం చేసుకోవాలని కోరినట్టు చెప్పారు.