విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ
ఇమాంపేట(సూర్యాపేటరూరల్) : చదువుకు పేదరికం అడ్డుకాదని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించి నేడు గ్రూప్ 1 ఆఫీసర్గా మీ ముందుకొచ్చానని సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇమాంపేట ఆదర్శపాఠశాలలో అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే డిక్షనరీల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం చదువని, ఆ ఆయుధంతో ఎన్నో విజయాలు సాధించవచ్చన్నారు. అమ్మా పౌండేషన్ వ్యవస్థాపకులు పోలా గాంధీ, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.