Immigration Ban
-
విదేశీయుల కట్టడికి ట్రంప్ తొలి అడుగు
వాషింగ్టన్: అమెరికాకు వెల్లువెత్తుతున్న విదేశీ వర్కర్లని పూర్తి స్థాయిలో కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే గ్రీన్ కార్డులపై అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలిక నిషేధం విధించారని అధ్యక్షుడి ఇమిగ్రేషన్ ఎజెండా రూపకర్త స్టీఫెన్ మిల్లర్ వెల్లడించారు. అమెరికా వలస విధానంలో భారీగా మార్పులు తీసుకురావడం కోసమే అధ్యక్షుడు తొలుత గ్రీన్ కార్డులపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు తీసుకువచ్చారని ట్రంప్ తరఫున పనిచేసే కొందరు ప్రతినిధులతో మిల్లర్ చెప్పినట్టుగా వాషింగ్టన్ పోస్టు కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగాల కోసం వచ్చే వారంతా వారి కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని తీసుకువస్తూ ఉండడంతో వలసదారులు ఎక్కువైపోయారని మిల్లర్ పేర్కొన్నారు. అందుకే ఫ్యామిలీ వీసాలను కూడా ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్లకి ఉద్యోగాలు లేకుండా విదేశీయుల్ని ఎందుకు పోషించాలన్నది మిల్లర్ విధానంగా ఉంది. -
కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్
వాషింగ్టన్: కోవిడ్ నేపథ్యంలో అమెరికన్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తామని ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది రెండు నెలలపాటు ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించే గ్రీన్ కార్డుల జారీని ఈ రెండు నెలలు నిలిపివేస్తామని వెల్లడించారు. వలసదారులపై 60 రోజుల నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై బుధవారం సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ‘కరోనా మహమ్మారితో 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. విదేశీయుల్ని వారి స్థానంలో ఉద్యోగాల్లో తీసుకుంటే మన పౌరులకు అన్యాయం జరుగుతుంది. అలా జరగనివ్వం’అని ట్రంప్ అన్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉండాలని వచ్చే వారి వలసలకే అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారెవరినీ రెండు నెలలు ఇక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డాక ఈ ఉత్తర్వుల్ని సమీక్షిస్తామన్నారు. ‘అమెరికా పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం మన బాధ్యత. ఈ రెండు నెలల తర్వాత ఆర్థిక పరిస్థితుల్ని నిపుణుల కమిటీ అంచనా వేసిన తర్వాత దానిని పొడిగించాలా, మార్పులు చేయాలా ఆలోచిస్తాం’’అని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రతీ ఏడాది అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారికి లక్షా 40 వేల గ్రీన్ కార్డులను ఒక్కో దేశానికి 7శాతం వాటా చొప్పున మంజూరు చేస్తూ ఉంటుంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసు (సీఆర్ఎస్) అంచనాల ప్రకారం విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులు 10 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 5,68,414 మంది వరకు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారని సీఆర్ఎస్ అంచనా. ట్రంప్ నిర్ణయంతో ఇక గ్రీన్ కార్డు వస్తుందా రాదా అన్న అయోమయంలో అక్కడి భారతీయులు ఉన్నారు. న్యాయస్థానంలో చెల్లుతుందా ? అమెరికాకి పూర్తిగా వలసలు నిషేధించే అధికారం అధ్యక్షుడికి ఉండదని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని న్యాయ స్థానంలో సవాల్ చేయవచ్చునని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ డిప్యూటీ పాలసీ డైరెక్టర్ ఆండ్రూ ఫ్లోర్స్ చెప్పారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ వలసల అంశాన్ని ఎత్తుకున్నారని డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. హెచ్1బీపై ఉత్తర్వులు? అమెరికా నిర్ణయంతో ప్రభావితమయ్యే వారు, భారత్ టెక్కీలు అత్యధికంగా కలిగి ఉన్న హెచ్1బీ వీసాలపై అధ్యక్షుడు విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని వైట్‌హౌస్ పాలనాయంత్రాంగం అధికారి చెప్పారు. ఈ వలసల నిషేధంలో కొన్ని మినహాయింపులు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఆ మినహాయింపులేమిటో ఆయన వివరించలేదు. ‘‘అమెరికాకి పూర్తిగా వలసల్ని నిషేధించం. కొందరికి మినహాయింపులుంటాయ్. మానవత్వ అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటాం’’అని ట్రంప్ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఆహారం పంపిణీ చేసేవారికి మిహాయింపులిచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
కొంపముంచనున్న ట్రంప్ వలస విధానం
⇒ మూడు లక్షల మంది వెనక్కి! ⇒ భారతీయులపై ట్రంప్ వలస ప్రణాళికల ప్రభావం ⇒ మొత్తమ్మీద 1.1 కోట్ల మందిని అమెరికా నుంచి పంపే అవకాశం వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివాదాస్పద వలస విధానాల ఫలితంగా 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు సహా మొత్తం 1.1 కోట్ల మంది అనధికారిక వలసదారులు బహిష్కరణను ఎదుర్కొనే అవకాశముంది. వీరిని దేశం నుంచి పంపించేందుకు ఫెడరల్ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను విస్తృతం చేస్తూ ట్రంప్.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసి రంగం సిద్ధం చేశారు. ‘పంపించాల్సిన విదేశీయులకు సంబంధించి ఏ కేటగిరీల వారికీ ఇక ఎంతమాత్రం మినహాయింపు ఉండదు’ అని అంతర్గత భద్రత విభాగం(డీహెచ్ఎస్) తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వలస చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానమున్న ఏ విదేశీయుడినైనా అరెస్ట్ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి ఈ విభాగ సిబ్బందికి పూర్తి అధికారాలు ఉంటాయని పేర్కొంది. అక్రమ వలసదారులను వెళ్లగొట్టేందుకు డీహెచ్ఎస్ మంగళవారం రెండు ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. నేరచరిత ఉన్న విదేశీయులపై ప్రధానంగా దృష్టి సారించినా, ఇతరులను కూడా లక్ష్యం చేసుకున్నారు. అమెరికాలోని అక్రమ వలసదారుల్లో 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అనధికారిక అంచనా. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. అధికారిక పత్రాలు లేని వలసదారులపై, ప్రవేశ అర్హత లేదని తేలడానికి ముందు రెండేళ్లపాటు అమెరికాలో ఉండని వారిపై తక్షణ తొలగింపు నిబంధనలను అమలు చేయడానికి డీహెచ్ఎస్ సెక్రటరీకి అధికారం ఉంటుంది. అయితే ఒంటరి మైనర్లకు, ఆశ్రయానికి దరఖాస్తు చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి, స్వదేశంలో వేధింపులు, చిత్రహింసల భయం ఉన్నవారికి, తమకు చట్టబద్ధ వలస హోదా ఉందని చెప్పేవారికి మినహాయింపు ఉంటుంది. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడం వల్ల వారు మళ్లీ అక్రమంగా రాలేరని ఉత్తర్వులో పేర్కొన్నారు. వారిని తక్షణం సొంత దేశాలకు అప్పగించడం వల్ల, జైళ్లు, న్యాయవ్యవస్థల వనరులను పొదుపు చేసుకుని ఇతర ప్రాధాన్య విదేశీయులకు కేటాయించడానికి వీలవుతుందని తెలిపారు. భారీ తరలింపులు ఉండవు: వైట్‌హౌస్ కొత్త మార్గదర్శకాల వల్ల విదేశీయులను భారీసంఖ్యలో పంపబోరని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ స్పష్టం చేశారు. ప్రస్తుత చట్టాలను అమలు చేయడానికి అధికారులకు అధికారాలివ్వడానికే వీటిని తెచ్చినట్లు వెల్లడించారు. వారిపై తీసుకునే చర్యలివీ.. అక్రమ వలసదారులపై పలు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డీహెచ్ఎస్ పత్రాల్లో పేర్కొన్నారు. వారి నేరాలను బయటపెట్టడం, గోప్యత హక్కుల రద్దు, వారిపై చర్యలు తీసుకోవడానికి స్థానిక పోలీసులకు అధికారాలు, కొత్త జైళ్ల నిర్మాణం, ఆశ్రయం కోరేవారిని నిరుత్సాహపరచడం వంటివి ఇందులో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని, షాపుల్లో దొంగతనాలు చేసిన వారిని కూడా తీవ్ర నేరాల్లో దోషులుగా తేలినవారితో సమానంగా పరిగణిస్తారని పేర్కొంది. మంగళవారం న్యూయార్క్‌లోని లిబర్టీ విగ్రహం వద్ద దర్శనమిచ్చిన ‘శరణార్థులకు స్వాగతం’ బ్యానర్ -
ట్రంప్ మాదిరి భారత్ చేయాలి: యోగి ఆదిత్యానాథ్
బులంద్ షహర్ : వలసవాదులపై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లపై ఓ వైపు నిరసనల గళం వెల్లువెత్తుతుండగా.. బీజేపీ చట్టసభ్యుడు యోగి ఆదిత్యానాథ్ మాత్రం ఇందుకు భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని ఆయన కొనియాడారు. టెర్రరిజాన్ని రూపుమాపడానికి భారత్ సైతం ట్రంప్లాగానే వ్యవహరించాలంటూ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కాబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏడు ముస్లి దేశాలపై, వలసవాదులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ జారీచేసిన సంగతి తెలిసిందే. టెర్రరిజాన్ని అంతమొద్దించడానికే ఈ ఆదేశాలు జారీచేసినట్టు ట్రంప్ చెప్పుకొస్తున్నారు. భారత్‌లో ఉగ్రకార్యకలాపాలు నిర్మూలించడానికి ట్రంప్ మాదిరే వ్యవహరించాలని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు కశ్మీర్ వ్యాలీలో మాదిరిగా మారాయని వ్యాఖ్యానించారు. కశ్మీరీ పండిట్లు టెర్రరిజంగా మారడం లేదా అక్కడ నుంచి బలవంతంగా వచ్చేయడం చేస్తున్నారన్నారు. ముజఫర్‌నగర్, మీరూట్, ఘజియాబాద్ ప్రాంతాల పరిస్థితి కూడా అంతేనన్నారు. సమాజ్‌వాద్ పార్టీ, మాయవతి బీఎస్పీలు వ్యవహరిస్తున్న పాలసీలపై మండిపడ్డారు. 1990లో కశ్మీర్లో ఏం జరిగిందో.. యూపీలో కూడా ప్రస్తుతం అదే జరుగుతుందని ఆదిత్యానాథ్ విమర్శించారు. ఈ పరిస్థితులను మరెన్నో రోజులు బీజేపీ కొనసాగించదని పేర్కన్నారు. కశ్మీర్ వ్యాలీని తాము కోల్పోయం, కానీ పశ్చిమ ఉత్తరప్రదేశాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదుల్కోమని చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)