ట్రంప్ మాదిరి భారత్ చేయాలి: యోగి ఆదిత్యానాథ్ | BJP's Yogi Adityanath Praises Donald Trump's Immigration Ban, Says India Needs It | Sakshi
Sakshi News home page

ట్రంప్ మాదిరి భారత్ చేయాలి: యోగి ఆదిత్యానాథ్

Published Tue, Jan 31 2017 2:11 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్ మాదిరి భారత్ చేయాలి: యోగి ఆదిత్యానాథ్ - Sakshi

ట్రంప్ మాదిరి భారత్ చేయాలి: యోగి ఆదిత్యానాథ్

బులంద్ షహర్ : వలసవాదులపై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లపై ఓ వైపు నిరసనల గళం వెల్లువెత్తుతుండగా.. బీజేపీ చట్టసభ్యుడు యోగి ఆదిత్యానాథ్ మాత్రం ఇందుకు భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని ఆయన కొనియాడారు. టెర్రరిజాన్ని రూపుమాపడానికి భారత్ సైతం ట్రంప్లాగానే వ్యవహరించాలంటూ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కాబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏడు ముస్లి దేశాలపై, వలసవాదులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ జారీచేసిన సంగతి తెలిసిందే. టెర్రరిజాన్ని అంతమొద్దించడానికే ఈ  ఆదేశాలు జారీచేసినట్టు ట్రంప్ చెప్పుకొస్తున్నారు.
 
భారత్లో ఉగ్రకార్యకలాపాలు నిర్మూలించడానికి ట్రంప్ మాదిరే వ్యవహరించాలని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు కశ్మీర్ వ్యాలీలో మాదిరిగా మారాయని వ్యాఖ్యానించారు. కశ్మీరీ పండిట్లు టెర్రరిజంగా మారడం లేదా అక్కడ నుంచి బలవంతంగా వచ్చేయడం చేస్తున్నారన్నారు. ముజఫర్నగర్, మీరూట్, ఘజియాబాద్ ప్రాంతాల పరిస్థితి కూడా అంతేనన్నారు.  సమాజ్వాద్ పార్టీ, మాయవతి బీఎస్పీలు వ్యవహరిస్తున్న పాలసీలపై మండిపడ్డారు. 1990లో కశ్మీర్లో ఏం జరిగిందో.. యూపీలో కూడా ప్రస్తుతం అదే జరుగుతుందని ఆదిత్యానాథ్ విమర్శించారు. ఈ పరిస్థితులను మరెన్నో రోజులు బీజేపీ కొనసాగించదని పేర్కన్నారు. కశ్మీర్ వ్యాలీని తాము కోల్పోయం, కానీ పశ్చిమ ఉత్తరప్రదేశాన్ని మాత్రం  ఎట్టిపరిస్థితుల్లో వదుల్కోమని చెప్పారు. 
 

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement