immune vaccines
-
అయ్యో.. బంగారుకొండ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలి తీసుకుంది. పదుల సంఖ్యలో నవజాత శిశువులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. మరో 24 గంటలు గడిస్తే కానీ వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. టీకాలు వేశాక ఒక మందుకు బదులు మరో మందు ఇవ్వడమే పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందని తేలింది. ఎలా జరిగింది? జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో శిశువులకు వాక్సినేషన్ వేశారు. ఒకటిన్నర నెలల నుంచి మూడున్నర నెలలలోపు ఉన్న 92 మంది శిశువులకు పెంటావాలంట్ వాక్సిన్ ఇచ్చారు. సాధారణంగా టీకాలు వేశాక శిశువులకు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బంది జ్వరాన్ని తగ్గించేందుకు ‘పారాసిటమాల్’టాబ్లెట్ ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నొప్పుల నివారణకు వాడే ‘ట్రెమడాల్’(300 ఎంజీ) పెయిన్‌కిల్లర్ టాబ్లెట్‌ను ఇచ్చారు. సాధారణంగా ఈ మాత్రలను పిల్లలకు రికమెండ్ చేయరు. ఆస్పత్రి వైద్య సిబ్బంది వాటిని పరిశీలించకుండానే పంపిణీ చేయడంతో ఇది తెలియని తల్లిదండ్రులు ఆ మాత్రలను పిల్లలకు వేశారు. దీంతో టాబ్లెట్ వేసిన కొద్దిసేపటికే అవి వికటించి పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డోస్ ఎక్కువై..ఊపిరాడక, అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం చికిత్స కోసం చిన్నారులను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కిషన్‌బాగ్‌కు చెందిన రెండున్నర నెలల ఫైజాన్ అనే బాలుడు మార్గమధ్యలోనే మృతిచెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తూ అపస్మారక స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న మ రో ముగ్గురు (సయ్యద్ ముస్తఫా, హీనా బేగం, అబూఅజ్మల్)శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంట లు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం వరకు 22 మంది చిన్నారులను నిలోఫర్‌కు తరలించగా సాయంత్రానికి ఈ బాధితుల సంఖ్య 27కు చేరుకుంది. కళ్లు మూసుకుని మందులు పంచారు.. నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వాక్సినేషన్‌తోపాటు ప్రసవాలు, ఆర్థోపెడిక్ వంటి స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్నారు. సర్జరీల తర్వాత నొప్పిని నివారించేందుకు ఆ టాబ్లెట్లను వాడుతుంటారు. వీటిని పెద్దలకే ఇస్తారు. ఫార్మసీ సిబ్బంది ఓపీ సేవలకు ముందే తమ వద్దకు వచ్చిన మెడికల్ స్ట్రిప్‌లను (రెండు టాబ్లెట్ల చొప్పున) ఐదు భాగాలుగా కట్ చేసుకొని బాక్సుల్లో పెట్టుకుంటారు. మందులు నిల్వ చేసిన బాక్సులు సహా ఆ రెండు టాబ్లెట్ల కవర్లు చూడ్డానికి ఒకేలా ఉండటం, సిబ్బంది వాటిపై ముద్రించిన పేర్లు కూడా చూడకుండానే పంచడం, విషయం తెలియక తల్లిదండ్రులూ వేయడం చిన్నారుల అస్వస్థతకు కారణమైంది. ఫార్మసిస్ట్‌లే మందులు ఇవ్వాల్సి ఉండగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఏఎన్ఎంలతో పంపిణీ చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎన్ఎంలుగా పని చేస్తున్న వారిలో చాలా మందికి చికిత్సలపై అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. త్వరలోనే కోలుకుంటారు.. చిన్నారులంతా త్వరలోనే కోలుకుంటారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
అరె.. ఏ మైంది..!
తణుకు అర్బన్: చిన్నారులను కంటి రుగ్మతల నుంచి దూరం చేసే ఔషధం ఏ విటమిన్. పదినెలల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు 9 డోసులుగా దీనిని అందించాలి. అయితే దీని సరఫరాలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. నాలుగునెలల నుంచి ఇదే దుస్థితి నెలకొంది. ఫలితంగా చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లో ఏ విటమిన్ ద్రవం అందుబాటులో లేదు. దీంతో దానిని పిల్లలకు వేయించేందుకు వెళ్లిన వారిని వైద్యసిబ్బంది తిప్పిపంపిస్తున్నారు. దీంతో ప్రజల వద్దకే వైద్యసేవలు, చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఏ విటమిన్ సరఫరాలో నిర్లక్ష్యం వహించడంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నవంబర్‌లో వెనక్కి! ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలతోపాటు అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు ఏ విటమిన్ ద్రవాన్ని అందుబాటులో ఉంచాలి. పిల్లలకు 10వ నెల వయసు నుంచి 5 సంవత్సరాల్లోపు 9 డోసులుగా ఈ ద్రవాన్ని పట్టించాలి.. అయితే జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఎ–విటమిన్ ద్రవం నాలుగు నెలలుగా అందుబాటులో లేదు. జిల్లాలో ఏ విటమిన్ ద్రవం వంద మిల్లీలీటర్ల బాటిళ్లు నెలకు 120 వరకూ అవసరం ఉంటాయి. గతేడాది నవంబరులో జిల్లాకు ఏ–విటమిన్ ద్రవం సరఫరా అయింది. అయితే అది చిక్కగా ఉండడంతోపాటు నాణ్యత లేనిదిగా గుర్తించి తిప్పిపంపినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ ద్రవం రాష్ట్రానికి పూణే నుంచి రావాలని పేర్కొంటున్నారు. మొక్కుబడిగా పలకరింపు చిన్నారుల కంటిచూపునకు ఊతమిచ్చే ఎ–విటమిన్ ద్రవం లేకుండా వ్యాధినిరోధక టీకాలు వేయించాలంటూ నిర్వహిస్తున్న పలకరింపు కార్యక్రమం నవ్వులపాలవుతోంది. జిల్లా వ్యాప్తంగా 4లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. వీరి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పలకరింపు కార్యక్రమం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది 3,600 బృందా లుగా విడిపోయి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను పలకరిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు పలకరింపు కార్యక్రమంలో ఏ విటమిన్ గురించి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఉండే క్లస్టర్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాలతోపాటు మాతా, శిశు సంరక్షణపై వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండేది. ప్రతి క్లస్టర్‌కు 6 పీహెచ్‌సీలను అనుసంధానం చేసి ఒక సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షించేవారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత క్లస్టర్ విధానాన్ని రద్దుచేసింది. దీంతో వైద్యసేవలపై పర్యవేక్షణ తగ్గింది. త్వరలో వస్తుంది ఏ విటమిన్ ద్రవం రావాల్సి ఉంది. గత నవంబరులో వచ్చిన ద్రవం నాణ్యత లేదని తిప్పి పంపించాం. త్వరలోనే కొత్త స్టాకు వస్తుంది. పలకరింపు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం. – పి. మోహన కృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, ఏలూరు -
చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
జనవరి చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన 5 వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను జనవరి మాసం చివరినాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై, ఇతర రోగ నిరోధక టీకాలపై సోమవారం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చంద్ర, కమిషనర్ డాక్టర్ పి.సాంబశివరావు పెంటావలెంట్ టీకా, ఇతర రోగ నిరోధక టీకాల అమలు ఏర్పాట్లపై సమీక్షించారు.పెంటావలెంట్ టీకా ద్వారా చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచిదన్న సందే శాన్ని... ఎంతో సురక్షితమైన టీకాగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జనవరి చివరి నాటికి ఈ టీకాను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నా...ఇంకా తేదీ ఖరారు చేయలేదని తెలిసింది.