జనవరి చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన 5 వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను జనవరి మాసం చివరినాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై, ఇతర రోగ నిరోధక టీకాలపై సోమవారం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చంద్ర, కమిషనర్ డాక్టర్ పి.సాంబశివరావు పెంటావలెంట్ టీకా, ఇతర రోగ నిరోధక టీకాల అమలు ఏర్పాట్లపై సమీక్షించారు.పెంటావలెంట్ టీకా ద్వారా చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచిదన్న సందే శాన్ని... ఎంతో సురక్షితమైన టీకాగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జనవరి చివరి నాటికి ఈ టీకాను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నా...ఇంకా తేదీ ఖరారు చేయలేదని తెలిసింది.
చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
Published Tue, Dec 9 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement