Pentavalent
-
టీకా వికటించి చిన్నారి మృతి
మారేడుమిల్లి(తూర్పుగోదావరి): వ్యాక్సిన్ వికటించి ఐదు నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పెద్దమల్లంపాడు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులకు బుధవారం వ్యాక్సిన్(పెంటావాలెంట్-రోటావైరస్) వేయించారు. టీకా వేసిన కొద్ది సేపటికే ఐదునెలల చిన్నారి మృతిచెందింది. మరో ఇద్దరి చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
శిశువులందరికీ ‘పెంటావాలెంట్’ వేయండి
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ విజ్ఞప్తి దుష్ఫలితాలు ఉండవని స్పష్టీకరణ వారానికి రెండు రోజులు అందుబాటులో టీకా 11 లేదా 12 నుంచి తెలంగాణలో ప్రారంభం హైదరాబాద్: ఐదు ప్రమాదకర వ్యాధులైన కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, హెమోఫిలస్ ఇన్ఫ్లూయెంజాలను ఒకే మందుతో నిలువరించే పెంటావాలెంట్ టీకాను పుట్టిన ప్రతి బిడ్డకూ వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యుహెచ్‌వో) ప్రతినిధి డాక్టర్ కె.ఎన్.అరుణ్‌కుమార్, యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ సంజీవ్ ఉపాధ్యాయ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జయకుమార్, జోగారావు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ టీకాను ఈ నెలలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారు మంగళవారం మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న టీకా కార్యక్రమంలో డీపీటీ, హెపటైటిస్-బి ఇప్పటికే ఉన్నాయని... ఇప్పుడు హిబ్ టీకాను కొత్తగా చేరుస్తున్నామన్నారు. వీటి కలయికనే పెంటావాలెంట్ టీకా అంటారని వివరించారు. హిబ్ టీకాతో హెమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్-బి వల్ల కలిగే తీవ్రమైన న్యూమోనియా, మెనింజైటిస్, బ్యాక్టిరీమియా, గొంతువ్యాధులు, సెప్టిక్ అర్ధరైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చన్నారు. పెంటావాలెంట్ టీకా వల్ల శిశువులకు ఇచ్చే ఇంజెక్షన్లు తగ్గుతాయని... ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా రక్షణ పెరుగుతుందన్నారు. తెలంగాణలో 6.31 లక్షల మంది చిన్నారులకు టీకా.. పెంటావాలెంట్ టీకాను ఈ నెల 7న ఏపీలోని తిరుపతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామన్నారు. 9వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో టీకా అందుబాటులోకి రానుందన్నారు. తెలంగాణలోని వరంగల్‌లో ఈ నెల 11 లేదా 12న ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి వారంలో రెండ్రోజులు టీకాను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో 6.31 లక్షల మంది, ఏపీలో 8.36 లక్షల మంది పిల్లలను పెంటావాలెంట్ టీకా వేయడానికి గుర్తించామన్నారు. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారని, పుట్టిన ప్రతి బిడ్డకూ 3-6 నెలల మధ్య ఈ టీకా వేయాలన్నారు. పుట్టిన వెంటనే శిశువులకు 24 గంటలలోపు ఇచ్చే హెపటైటిస్-బి మోతాదు యథావిధిగా కొనసాగుతుందని, 16-24 నెల లు, 5-6 ఏళ్ల డీపీటీ బూస్టర్లు ఇంతకుముందులాగే కొనసాగుతాయని, పెంటావాలెంట్ టీకాతో శిశువుకు ఇచ్చే ఇంజెక్షన్లు 9 నుంచి 3కు తగ్గుతా యని చెప్పారు. ప్రస్తుతం ఉన్నట్లుగా కాకుండా టీకా షెడ్యూల్ మారుతుందన్నారు. ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా ఇస్తుందన్నారు. ఈ టీకాతో భయపడాల్సిన పనిలేదని, దీనిపై మీడియా కూడా అవగాహన లేకుండా ఏమీ రాయరాదని విన్నవించారు. -
చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
ప్రాణాంతక ఐదు వ్యాధుల నుంచి రక్షణ మూడో వారంలో ప్రారంభానికి ఏర్పాట్లు ఏడున ‘ఇంద్రధనుస్సు’ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కంఠసర్పి, కోరింతదగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బీ, ఇన్‌ఫ్లూయెంజా.. ఈ ఐదు వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను ఈ నెల మూడోవారంలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించే అవకాశాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గత జనవరి చివరినాటికి ఈ టీకాను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినా కిందిస్థాయిలో ఏర్పాట్లు జరగకపోవడంతో అప్పట్లో వాయిదా వేశారు. పెంటావలెంట్ టీకాపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు ఈ టీకాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మార్కెట్ సెంటర్లు, రైల్వే, బస్స్టేషన్లు, సినిమా థియేటర్లలో పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సందేహాలపై చిన్నపాటి గైడ్‌ను తెలుగులో తయారుచేసి అన్ని జిల్లాలకు పంపించారు. వీటిని ఆశ, ఏఎన్ఎం తదితర వైద్య సిబ్బందికి అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పెంటావలెంట్ టీకా చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచిదన్న సందే శాన్ని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర అవసరాల కోసం 11 లక్షల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని జిల్లాల వారీగా త్వరలోనే పంపిణీ చేయనున్నారు. బాలానగర్‌లో ఇంద్రధనుస్సు... సార్వత్రిక రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా సక్రమంగా టీకాలు అందని పిల్లలకు తిరిగి టీకాలు వేసేందుకు రూపొందించిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని ఈ నెల ఏడో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కస్టర్ పరిధిలోని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతీ నెల ఒక వారం పాటు... అలా నాలుగు నెలల్లో నాలుగు వారాలు ఇంద్రధనుస్సు కార్యక్రమం అమలుకానుంది. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు టీకాలు వేస్తారు. -
చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
జనవరి చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన 5 వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను జనవరి మాసం చివరినాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై, ఇతర రోగ నిరోధక టీకాలపై సోమవారం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చంద్ర, కమిషనర్ డాక్టర్ పి.సాంబశివరావు పెంటావలెంట్ టీకా, ఇతర రోగ నిరోధక టీకాల అమలు ఏర్పాట్లపై సమీక్షించారు.పెంటావలెంట్ టీకా ద్వారా చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచిదన్న సందే శాన్ని... ఎంతో సురక్షితమైన టీకాగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జనవరి చివరి నాటికి ఈ టీకాను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నా...ఇంకా తేదీ ఖరారు చేయలేదని తెలిసింది.