imperial college
-
కేన్సర్‌ను ‘కత్తి’లా పసిగట్టేస్తుంది..!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్ (ఐనైఫ్) గర్భాశయ కేన్సర్‌ను సెకండ్లలో పసిగట్టేస్తోంది. కేన్సర్ చికిత్సలను త్వరితగతిని అందించి ఎందరో మహిళల ప్రాణాలను కాపాడే అవకాశం ఐనైఫ్ ద్వారా వచ్చిందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో వైద్య నిపుణులు చెప్పారు. సాధారణంగా మహిళల్లో వచ్చే ఎండోమెట్రియల్ కేన్సర్‌ను గుర్తించడం ఆలస్యం అవడం వల్ల దుష్ప్రభావాలు అధికం. అయితే ఈ ఐనైఫ్తో సెకండ్లలో కేన్సర్‌ను గుర్తించగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. వివరాలను జర్నల్ కేన్సర్స్‌లో ప్రచురించారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు అనుమానం ఉన్న 150 మంది మహిళల టిష్యూ శాంపిల్స్‌ను సర్జికల్ కత్తితో పరీక్షిస్తే సెకండ్లలోనే ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ పద్ధతిలో చేసిన ఫలితాలతో పోల్చి చూస్తే 86% ఫలితాలు సరిగ్గా ఉన్నాయని ఆ అధ్యయనం వివరించింది. -
భారత్‌లో వ్యాక్సిన్లతో... 42 లక్షల ప్రాణాలు నిలిచాయి
లండన్: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, వాటివల్ల 2021లో భారత్ 42 లక్షల మరణాలను నివారించిందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. యూకేలోని లండన్‌లో ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్–19 వాస్తవ మరణాలను, డిసెంబర్ 8, 2020, డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్‌ను సరిపోల్చి చూస్తూ ఈ లెక్కలు వేశారు. భారత్‌లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ‘‘భారత్‌కు సంబంధించినంత వరకు ఈ ఏడాది కాలంలో 42,10,000 మరణాలను నివారించగలిగిందని మాకు అంచనాలున్నాయి’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ ఒలివర్ వాట్సన్ చెప్పారు. 2 కోట్ల ప్రాణాలు పోయేవి కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకి, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ తేడా ఉన్నట్టు విమర్శలున్నాయి. కరోనాతో 189 దేశాల్లో 3.14 కోట్ల మంది మరణిస్తారని అనుకుంటే వ్యాక్సిన్లు రావడం వల్ల వారిలో 1.98 కోట్ల మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతీ దేశంలో 40శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండి ఉంటే 5.99 లక్షల మరణాలు తప్పేవని అధ్యయనం పేర్కొంది. 17 వేలకు పైగా కేసులు న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 30శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 17,336 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనాతో ఒక్క రోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఆ సమయంలో సంగీతం వద్దు!
లండన్: శస్త్రచికిత్స చేసే సమయంలో సంగీతం వినిపించేలా చేయడం వల్ల రోగులకు, వైద్యులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. శస్త్రచికిత్స సమయంలో మ్యూజిక్ ప్లే చేస్తే సీనియర్, జూనియర్ డాక్టర్ల మధ్య సయన్వయ లోపం తలెత్తవచ్చని, ఇది చివరకు వారిలో ఒత్తిడికి దారి తీయవచ్చని పరిశోధకులు అన్నారు. అంతిమంగా రోగిపై ఇది ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50-70 శాతం శస్త్రచికిత్సలకు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. శస్త్రచికిత్స చేసే సమయంలో సంగీతం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన షరాన్ వెల్డన్ బృందం అధ్యయనం జరిపింది. దీనిలో భాగంగా బ్రిటన్‌లో 20 శస్త్రచికిత్సల్ని పరిశీలించారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా పరికరం కావాల్సి వచ్చినప్పుడు సంగీతం వల్ల ఎక్కువ సార్లు అడగాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందుల వల్ల రోగి భద్రత విషయంలో సమస్యలు తలెత్తవచ్చని వెల్డన్ వెల్లడించారు. అయితే సంగీతం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నప్పటికీ, ఇబ్బందులే ఎక్కువని ఆయన అన్నారు.