Imports gold
-
ఏప్రిల్-జూలై నెలల్లో పసిడి దిగుమతులు అప్
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదటి నాలుగు నెలల కాలంలో (ఏప్రిల్-జూలై) 6.4 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అయితే ఒక్క జూలై నెలను తీసుకుంటే మాత్రం దిగుమతులు భారీగా 43.6 శాతం పడిపోయి 2.4 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. (Radhakishan Damani: ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!) ఎగుమతులు-దిగుమతుల విలువకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు భారీగా పెరిగిపోవడంలో క్రూడ్‌తో పాటు పసిడి కూడా ప్రధాన కారణంగా ఉంటోంది. 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో వాణిజ్యలోటు మూడు రెట్లు పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై వరకూ) వాణిజ్య లోటు దాదాపు 99 బిలియన్ డాలర్లుగా ఉంది. (Today Stockmarket Closing: సెన్సెక్స్ 872 పాయింట్లు ఢమాల్) ఆభరణ పరిశ్రమ ఎగుమతులు ఊరట: చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు భారత్. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ నుంచి పసిడి డిమాండ్ అధికంగా ఉంది. అయితే దేశం నుంచి రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ఎగుమతులు పటిష్టంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెల్లో రత్నాలు, ఆభరణాల పరిశ్రమల ఎగుమతులు 7 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 13.5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
భారత్‌లో బంగారం మెరుపు
న్యూఢిల్లీ: స్వల్ప ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, బంగారం దిగుమతుల్లో భారత్ తన హవాను కొనసాగిస్తోంది. 2021లో 1,067 టన్నుల దిగుమతులు చేసుకుంది. కోవిడ్–19 తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న 2020లో ఈ పరిమాణం కేవలం 430.11 టన్నులు. 2019తో పోల్చిచూస్తే, 28 శాతం పెరిగి 836.38 టన్నులుగా నమోదయ్యింది. రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) నివేదిక ఒకటి అంశాలను వెల్లడించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - స్విట్జర్లాండ్ నుంచి 2021లో అత్యధికంగా 469.66 టన్నుల పసిడి దిగుమతులు జరిగాయి. వరుసలో తరువాతి మూడు స్థానాల్లో యూఏఈ (120.16 టన్నులు), దక్షిణాఫ్రికా (71.68 టన్నులు), గినియా (68.72 టన్నులు) ఉన్నాయి. - 2015లో దేశం 1,047 టన్నుల పసిడిని దిగుమతి చేసుకోగా, 2017లో 1,032 టన్నుల దిగుమతులు చేసుకుంది. అటు తర్వాత ఈ స్థాయి దిగుమతులు ఇదే తొలిసారి. - 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ చూస్తే, భారత్ సగటు నెలవారీ పసిడి దిగుమతులు నెలకు 76.57 టన్నులు. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరం దిగుమతులకు ఇది దాదాపు సరిసమానం. అంటే మొత్తంగా ఈ పరిమాణం 842.28 టన్నులు. - ఎగుమతుల విషయానికొస్తే, 2021లో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో భారతదేశం నుండి ఈ విభాగం నుంచి రవాణా 50 శాతం పెరిగి 8,807.50 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2020లో ఈ విలువ 5,876.39 మిలియన్ డాలర్లు. ఒక్క స్టడెడ్ గోల్డ్ ఆభరణాల ఎగుమతులు ఇదే కాలంలో 2,508.26 మిలియన్ డాలర్ల నుంచి 5,078.83 మిలియన్ డాలర్లకు ఎగసింది. ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల విలువ 3,369.13 మిలియన్ డాలర్ల నుంచి 3,728.66 మిలియన్ డాలర్లకు చేరింది. చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..! -
పసిడి దిగుమతులు వెలవెల..!
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 60.5 శాతం తగ్గాయి. విలువ రూపంలో 15.42 బిలియన్ డాలర్ల నుంచి 6.08 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. విదేశీ మారకద్రవ్య చెల్లింపుల అవసరం తగ్గడం వల్ల ఇది కరెంట్ అకౌంట్ (ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ-పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం)కు లాభించే పరిణామమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిది సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కరెంట్ అకౌంట్ మిగులు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలూ వెలువడుతున్నాయి.