'పఠాన్ నీ కొడుక్కి ఆ పేర్లు పెట్టకు'
భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తండ్రి అయ్యారు. ఈ నెల22న ఆయన భార్య సఫా బైగ్ మగ బిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపిన పఠాన్ కు చేదు అనుభవం ఎదురైంది. బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల లాగా బిడ్డకు పేరు పెట్టొద్దని ఓ అభిమాని పఠాన్ ను కోరాడు. దావుద్, యాకుబ్ లాంటి పేర్లు అసలే వద్దని అన్నాడు.
అభిమాని ట్వీట్ పై స్పందించిన ఇర్ఫాన్.. తన బిడ్డ దేశ గౌరవాన్ని కాపాడతాడని తనకు ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు. అయితే, పాకిస్తాన్ లెజండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ను ఉద్దేశించి ఈ పేరు పెట్టారా? అనే విషయంపై పఠాన్ స్పందించలేదు.