Imtiaz Khan Babul
-
బాలీవుడ్ సీనియర్ నటుడు మృతి
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు, చిత్ర నిర్మాత ఇంతియాజ్ ఖాన్(77) కన్నుమూశారు. మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఇంతియాజ్.. నటుడు జయంత్ కుమారుడు అలాగే అంజాద్ ఖాన్ సోదరుడు. ఇంతియాజ్‌కు భార్య కృతికా దేశాయ్(సినీ, టీవి నటి), కూతురు అయేషా ఖాన్ ఉన్నారు. యాదోంకి బారాత్, ధర్మాత్మ, దయావన్, హల్చల్, ప్యార్ దోస్త్, గ్యాంగ్, తదితర సినిమాల్లో నటించిన ఇంతియాజ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.(బాధ పడుతున్నా.. కానీ తప్పదు: నటి) బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ.. ఇంతియాజ్ ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘నటుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూశారు. అతనితో గ్యాంగ్ సినిమాలో నటించాను. ఇంతియాజ్ ఖాన్ అద్భుతమైన నటుడు. మానవతావాది. భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఇంతియాజ్ మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. (కరోనా అలర్ట్ : మహేష్‌బాబు సూచనలు) ఇంతియాజ్ ఖాన్, అంజాద్ ఖాన్ -
మావాడు క్లాస్ టాపర్.. ఉగ్రవాది అయ్యాడా?
ఢాకా: గత వారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన భారతీయ యువతి తరుషి జైన్ (19) తల్లిదండ్రులకు ఓ ఉగ్రవాది తండ్రి క్షమాపణ చెప్పారు. రోహన్ ఇంతియాజ్ అనే యువకుడు ఆ ఉగ్ర ఘటనలో అనుమానితుడు. అయితే ఆ నిందితుడి తండ్రి, బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ నేత అయిన ఇంతియాజ్ ఖాన్ బాబుల్ ఈ ఘటనపై క్షమాపణ కోరారు. తరుషి జైన్ కుటుంబానికి తాను మాత్రమే క్షమాపణ చెప్పగలనని, తానే చెప్పాలని, ఎందుకంటే మంచి తండ్రిని కాలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే క్షమాపణ చెప్పడానికి తనవద్ద మాటలు కరవయ్యాయని, ఏం చెప్పినా ఆ తల్లిదండ్రులకు తక్కువే అవుతుందని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు ఐఎస్ ఉగ్రవాది అని తెలిసి షాక్ కు గురయ్యానని చెప్పారు. గతేడాది డిసెంబర్ లో రోహన్ ఇంటినుంచి వెళ్లిపోయాక మళ్లీ తనకు కనిపించలేదని వెల్లడించారు. క్లాస్ టాపర్.. ఇలా దాడులు చేశాడా? మ్యాథ్స్ లో మాత్రమే కాదు క్లాస్ ఓవరాల్ టాపర్ తన కుమారుడని అయితే ఎందుకు ఇలా మారాడో తెలియదని చెప్పుకొచ్చారు. రోహన్ అదృశ్యంపై ఈ జనవరి 2న ఫిర్యాదు చేశాను. మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడని వివరించారు. రోహన్ జిహాదీ సాహత్యం చదవడం తాను ఎప్పుడూ చూడలేదని, తమ ఇద్దరికీ ఒక్కటే కంప్యూటర్ ఉండేదని మీడియాకు వెల్లడించారు. గత వారం ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదులు దాడిచేసి 20 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే.