
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు, చిత్ర నిర్మాత ఇంతియాజ్ ఖాన్(77) కన్నుమూశారు. మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఇంతియాజ్.. నటుడు జయంత్ కుమారుడు అలాగే అంజాద్ ఖాన్ సోదరుడు. ఇంతియాజ్‌కు భార్య కృతికా దేశాయ్(సినీ, టీవి నటి), కూతురు అయేషా ఖాన్ ఉన్నారు. యాదోంకి బారాత్, ధర్మాత్మ, దయావన్, హల్‌చల్, ప్యార్ దోస్త్, గ్యాంగ్, తదితర సినిమాల్లో నటించిన ఇంతియాజ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.(బాధ పడుతున్నా.. కానీ తప్పదు: నటి)
బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ.. ఇంతియాజ్ ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నటుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూశారు. అతనితో గ్యాంగ్ సినిమాలో నటించాను. ఇంతియాజ్ ఖాన్ అద్భుతమైన నటుడు. మానవతావాది. భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఇంతియాజ్ మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. (కరోనా అలర్ట్ : మహేష్‌బాబు సూచనలు)
ఇంతియాజ్ ఖాన్, అంజాద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment