ఇన్చార్జ్ డీఆర్వోగా మల్లీశ్వరిదేవి
అనంతపురం అర్బన్ : డీఆర్వో సీహెచ్ హేమసాగర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఇన్చార్జ్ డీఆర్వోగా మల్లీశ్వరిదేవిని నియమిస్తూ కలెక్టర్ కోన శశిధర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మల్లీశ్వరిదేవి ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా ఉన్నారు. దాంతో పాటు డీఆర్వోగా పూర్తిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.