జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సాయిబాబు
బాలాజీచెరువు (కాకినాడ) :
జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రసాద్‌రాజును ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమించారు. జేఎన్టీయూకే కళాశాల ఈఈఈ విభాగ ఆచార్యులుగా ఉన్న సాయిబాబు ఏపీ జెన్కో, ఏపీ ఈపీడీసీఎల్ పోస్టుల భర్తీకు కన్వీనర్‌గా, మూడు సార్లు ఈసెట్ పరీక్షల కన్వీనర్‌గా, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎంసెట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తనను ఈ పదవిలో నియమించిన వీవీ వీఎస్ఎస్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో జేఎన్టీయూకే అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సాయిబాబును వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.